చిత్తూరు జిల్లా, డిసెంబర్13 ( News Telangana ) :-
వైయస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ రేసులో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా, విధులు నిర్వహిస్తున్న అంజు యాదవ్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈమె స్వగ్రామం వేంపల్లి గ్రామం, పులివెందుల నియోజకవర్గం కాగా వీరి భర్త నల్ల బోయిన గంగాధర్ యాదవ్, స్వగ్రామం మైదు కూరు నియోజక వర్గంలోని, దువ్వూరు మండలం మానే రాంపల్లి గ్రామం.బి సి సామాజిక వర్గంకు చెందినవాడు. వీరికి నియోజ కవర్గం లో మంచి బలమైన వర్గం, బంధుత్వం, సహా యం చేసే స్నేహి తులతో పాటు స్వంతంగా వీరికి క్యాడర్ ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త కోరిక మేరకు శ్రీమతి అంజు యాదవ్ రానున్న 2024 ఎమ్మెల్యే ఎన్నికలో బరిలోకి దిగే యోచనలో ఉందని ప్రాధమిక సమాచారం
previous post