News Telangana :- నూతన ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరారు.ప్రజలే కేంద్రంగా కాంగ్రెస్ పాలన కొనసాగించాలని సూచించారు. ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతుందని విమర్శించారు. శ్వేత పత్రంలో ప్రజలు ప్రగతి కోణం లేదుని ఆరోపించారు. శ్వేతపత్రంలో రాజకీయ ప్రత్యర్థులపై దాడి వాస్తవాల వక్రీకరణే ఉందని హరీశ్‌రావు అన్నారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయండని సూచించారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సస్పెండ్ అయిన ఆంధ్రా అధికారితో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారని మండిపడ్డారు. సీఎం పాత గురువు పాత శిష్యులు ఈ నివేదిక తయారు చేయించారని కావాలంటే వారి పేర్లుతో పాటు ఆధారాలు కూడా బయటపెడతని హరీశ్‌రావు తెలిపారు. అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని అన్నారు. అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తిని నివేదికలో చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.