November 21, 2024
News Telangana
Image default
Telangana

సీఎం రేవంత్‌ రెడ్డితో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే భేటీ..? పార్టీ మార్పు ఖాయమేనా..!!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాలనపై పట్టు సాధించిన సీఎం రేవంత్ రెడ్డి క్రమంగా రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై దృష్టిసారించారు. ఇటీవల నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మరో ఎమ్మెల్యే సీఎం రేవంత్‌ను కలిశారు. దీంతో పార్టీలో చేరికలపై ఫోకస్ చేశారని అర్థమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పాత మిత్రులు కొందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో కొందరు హస్తం పార్టీలో చేరడం ఖాయం అనే భావన వ్యక్తమవుతోంది.

  • వేం నరేందర్ రెడ్డి రాయబారం..?

సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌‌లో గల ఆయన నివాసంలో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిశారు. అక్కడ రేవంత్ రెడ్డి మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రకాశ్ గౌడ్‌కు నరేందర్ రెడ్డి శాలువాకప్పి సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రకాశ్ గౌడ్ మిత్రుడు అనే సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. 2009, 2014లో టీడీపీ నుంచి ప్రకాశ్ గౌడ్ పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రకాశ్ గౌడ్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. సోమవారం చేవెళ్ల కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం చేవెళ్ల పరిధిలోకి వస్తోంది. ఇంతలో ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలువడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

  • పొన్నం ప్రభాకర్‌తో చర్చలు..?

ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిశారు. గౌడ ప్రతినిధుల సమావేశంలో కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమయంలో పార్టీ మార్పు గురించి వార్తలు వచ్చాయి. తాను మర్యాదపూర్వకంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశానని ప్రకాశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలువడంతో పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అంతకుముందు మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. పైకి అలా చెబుతోన్న.. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అని ఆనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • ప్రకాశ్ గౌడ్ ఏమన్నారంటే..?

సీఎం రేవంత్ రెడ్డిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గంలో సమస్యల గురించి కలిశానని చెబుతున్నారు. కొత్వాల్ గూడ, బహదూర్ గూడ, ఘాన్సిమియాగూడ గ్రామాల్లో భూ సమస్యల పరిష్కరించాలని కోరానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని కోరగా, సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని ప్రకాశ్ గౌడ్ వివరించారు.. కేపి

0Shares

Related posts

కాంగ్రెస్ పార్టీకి అభినందనలు : కేటీఆర్

News Telangana

దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మదన్ రెడ్డిలు

News Telangana

ఇక నుంచి TS కాదు TG.. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..!

News Telangana

Leave a Comment