ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘రెండు సార్లు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటా. నేటి ఫలితం గురించి బాధపడట్లేదు. కానీ, మేము ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందాను. దీనిని మేము అభ్యాసంగా తీసుకొని తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
previous post
next post