December 3, 2024
News Telangana
Image default
Telangana

కన్నతల్లిని కడ తేర్చిన కొడుకు

సూర్యాపేట జిల్లా బ్యూరో అనంతగిరి, ఫిబ్రవరి 7(న్యూస్ తెలంగాణ దినపత్రిక): మద్యం మత్తులో కన్నతల్లిని కుమారుడు కడతేర్చిన సంఘటన అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మర బండ పాలెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల తమ్మరబండ పాలెం సుందరయ్య నగర్ కు చెందిన పుట్ట బంతి రాములమ్మ (70) గత రెండు సంవత్సరాల క్రితం తన కుమారుడు పుట్ట బంతి వీరేష్​తో కలిసి గరిడేపల్లి మండలం సర్వారం గ్రామము నుండి వలస వచ్చి తమరబండపాలెంలో జీవనం కొనసాగిస్తున్నారు,
వీరేష్​ తాపీ పని చేస్తున్నాడు.కానీ నిత్యం మధ్యనికి బానిసై తల్లిని చిత్రహింసలకు గురి చేసేవాడు. బుధవారం సైతం తాగిన మైకంలో తాగొద్దని వారిచ్చిన తల్లిని గొంతు నులిమి చంపాడు. విషయం తెలుసుకున్న అనంతగిరి ఎస్సె అనిల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు వీరేష్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

0Shares

Related posts

అవసరమైతే సిట్టింగ్‌లూ చేంజ్‌ !

News Telangana

ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలవాలని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

News Telangana

న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్

News Telangana

Leave a Comment