October 8, 2024
News Telangana
Image default
Telangana

నేటి రాశి ఫలితాలు.. ఆ రాశుల వారికి అంతా శుభమే

News Telangana : ( 07-02-2024)

  • మేషం

వ్యాపారాలు ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది.


  • వృషభం

మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి.


  • మిధునం

వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట నూతన సమస్యలు ఉత్పన్నమౌతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణ భారం అధికమౌతుంది. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగమున అదనపు భాధ్యతలుంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.


  • కర్కాటకం

ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన నష్టాలుంటాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.


  • సింహం

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగమున ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది.


  • కన్య

ధన వ్యవహారాలు కలసివస్తాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.


  • తుల

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.


  • వృశ్చికం

వ్యాపారామున భాగస్థులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.


  • ధనస్సు

ఉద్యోగమున వివాదాలు పరిష్కారమౌతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది.


  • మకరం

ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.


  • కుంభం

ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


  • మీనం

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.


0Shares

Related posts

వ్యక్తిగత దూషణలు మానుకోవాలి

News Telangana

న్యూస్ తెలంగాణ దినపత్రిక 2024 క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎస్సై శ్రీనివాస్ యాదవ్

News Telangana

ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలవాలని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

News Telangana

Leave a Comment