September 8, 2024
News Telangana
Image default
Telangana

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు

  • వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను ఎత్తుకెళ్తున్నట్లు తప్పుడు సమాచారం
  • ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనబడితే పోలీస్ స్టేషన్ లో లేదా డయల్ -100 కు సమచారం అందించండి
  • తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపైన చర్యలు తప్పవు
  • జిల్లాలో నిరంతరా నిఘాతో గస్తీ నిర్వహిస్తున్నాం..ప్రజలెవరు భయాందోళనకు గురి కావద్దు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా /న్యూస్ తెలంగాణ

జిల్లాలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వేరే రాష్ట్రాలకు చెందిన వారు మన జిల్లాలో గ్రామాలలో, పట్టణాల్లో తిరుగుతూ చిన్న పిల్లలను ఎత్తుకెల్లుతున్నారన్న పోటోలు, వీడియోస్ పోస్టు చేస్తున్న ప్రచారం నిజం కాదని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని,వేరే ప్రాంతాల్లో జరిగిన సంఘటనలకు సంబంధించిన విడియోస్, పోటోలు జిల్లాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేయద్దని జిల్లా ఎస్పీ తెలిపారు.
సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వస్తున్న చిన్న పిల్లల కిడ్నప్ లకు సంబంధించిన సమాచారం కానీ, ఫిర్యాదులు , ఆధారాలు కానీ పోలీస్ వ్వారికి అందలేదని,రోజు వారిగా జిల్లా అంతటా నిరంతరం నిఘా ఉంచి గస్తీ నిర్వహిస్తున్నామని, పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్ వాహనాలు 24/7 పెట్రోలింగ్ నిరహిస్తున్నాయని, జిల్లాలోకి ప్రవేశించే అన్ని రహదారులలో, పట్టణాలలో సీసీ కెమెరాల నిఘా ఉందన్నారు..సోషల్ మీడియా లో వస్తున్న పుకార్లు నిజం కాదని వాటిని ఎవ్వరు నమ్మొద్దు, ఇలాంటివి సంఘటనలు జరిగిన, సమాచారం ఉన్న సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమచారం అందిస్తే పోలీస్ వారు వాస్తవాలను విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ఎక్కడో జరిగిన సంఘటనలు జిలాల్లో జరిగినట్టు సోషల్ మీడియాలో తప్పుడు పుకార్లను పోస్ట్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై కూడా పోలీస్ నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

0Shares

Related posts

జర్నలిస్టును అవమానపరిచినందుకు తగిన గుణపాఠం

News Telangana

కెసిఆర్ ప్ర‌భుత్వంపై ఈసికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

News Telangana

పార్లమెంటుపై దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అరెస్ట్?

News Telangana

Leave a Comment