మద్దూరు ఫిబ్రవరి10(న్యూస్ తెలంగాణ) :- సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల అధికారి, శ్రీమతి జి.తనూజ రేషన్ షాపుల తనిఖీ, సోషల్ ఆడిట్, బినామీ డీలర్లు జిల్లాలో ఎవరైనా ఉన్నారా అనే అంశంపై ఇచ్చిన ఆదేశానుసారం మద్దూరు మండలంలోనీ మద్దూరు, రేబర్తి, వల్లంపట్ల, గాగిల్లాపూర్ మరియు నర్సాయిపల్లి గ్రామలలో రేషన్ దుకాణాలను పరిశీలన మరియు తనిఖీ చేయడం జరిగింది. ఈ క్రమంలో రేషన్ డీలర్లకు సంబంధించిన బియ్యం తూకంలో ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా,గోదాము నుండి రేషన్ దుకాణానికి బియ్యం చేరుతున్న క్రమంలో ఏవైనా సాంకేతికపరమైన లోపాలు ఉన్నాయా,అని అడిగి తెలుసుకోవడం జరిగింది.అదేవిధంగా రేషన్ దుకాణాల ముందు క్యూలో ఉన్న వినియోగదారులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యవసర వస్తువులు బియ్యం ఎలా ఉన్నాయి రేషన్ దుకాణం అందుబాటులో ఉంటుందా రేషన్ దుకాణానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం డి. జైనుల్ ఆబిదీన్, డిప్యూటీ తహసీల్దారు (పౌరసరఫర), మండల రెవెన్యూ పరిశీలకులు ఆయా దుకాణాలకు సంబంధించిన రేషన్ షాపు డీలర్లు, పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు వియోగదారులు పాల్గొన్నారు.