November 20, 2024
News Telangana
Image default
Telangana

మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ జిల్లా / న్యూస్ తెలంగాణ:-
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీఎస్ఆర్టీసీ అన్నీ ఏర్పాట్లు చేసిందని రవాణా,బీసీ సంక్షేమ శాఖల‌ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర జరుగుతుండగా భక్తుల రద్దీ దృష్ట్యా 25వ తేది వరకు 6 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపు తోందని తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ‌ బస్సులు జాతరకు వెళ్తుండడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సాధారణ ప్రయాణికులకు కొంత బస్సులు తగ్గే అవకాశం ఉంద‌ని, ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఈ జాతరకు అందు బాటులో ఉన్నందున.. ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో దాదాపు 40 లక్షల మంది వరకు భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వచ్చి అమ్మవార్లను దర్శించు కుంటారని సంస్థ అంచనా వేస్తోందన్నారు. భక్తులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చేందుకు పెద్ద సంఖ్యలో 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు

0Shares

Related posts

గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు

News Telangana

ఎక్సైజ్,పర్యటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరణ

News Telangana

సిరిసిల్ల పట్టణ సీఐ గా రఘుపతి బాధ్యతలు

News Telangana

Leave a Comment