July 11, 2024
News Telangana
Image default
Telangana

న్యూస్ తెలంగాణ బ్యూరో పై మైనింగ్ శాఖ ఏడి వెటకారం..!

  • మట్టి మాఫియా పై ప్రశ్నిస్తే స్పందించాలా..?
  • నేను ప్రభుత్వ ఉద్యోగిని అంటూ వెటకారం..?
  • పందిళ్ళపల్లి మట్టి మాఫియా పై ప్రశ్నిస్తే ఆ ట్రాక్టర్లే కదా..?
  • అందులో పట్టించుకోవాల్సింది ఏముంది..?
  • మరి వందలాది ట్రాక్టర్ల టిప్పర్ల సంగతేంటి..?
  • ఉదయం పూట 4272 రూపాయల పెనాల్టీ.. క్షణాలలో యధావిధిగా మట్టి అక్రమ రవాణా…?
  • కొనసాగుతున్న రఘునాథపాలెం మట్టి తవ్వకాలు..?
  • ఉదాసీనంగా వ్యవహరిస్తున్న మైనింగ్ ఏడి…?
  • సాయి లీలలు కనాలంటే… రెండు కళ్ళు కూడా చాలవు..

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో/న్యూస్ తెలంగాణ :-

రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదు.. అనే సామెతను అక్షరాలా నిజం చేస్తున్న ఖమ్మం మైనింగ్ శాఖ ఏడి పనితీరు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా రఘునాధపాలెం పువ్వాడ ఉదయ్ కుమార్ నగర్, పుట్టకోట, కోయచిలక, చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామాలలో నిత్యం అక్రమంగా రవాణా అవుతున్న మట్టి దందాపై న్యూస్ తెలంగాణ ఉమ్మడి జిల్లాల ప్రతినిధి వివరాల కోసం మైనింగ్ శాఖ ఏడి సాయినాద్ ను గురువారం సంప్రదించగా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలోని చెరువులో అక్రమంగా మట్టిని రవాణా చేసే వ్యవహారంపై ప్రశ్నించగా సాదాసీదాగా వెటకారంగా సమాధానం చెప్పటం విశేషం. ఆ ట్రాక్టర్లే కదా పోయేదేముంది. నేను పట్టించుకోవాలా మీరు సమాచారం ఇస్తే నేను అడ్డుకోవాలా? నేను ప్రభుత్వ ఉద్యోగిని ప్రభుత్వం చెప్పినట్లుగా వినాలి అని సమాధానం చెప్పటం విస్మయం కలిగిస్తుంది. నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు గుత్తేదారులు తెలంగాణకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా గత ఐదు నెలలుగా వందలాది ట్రాక్టర్లతో బహిరంగంగా అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నప్పటికీ స్పందించాల్సిన అధికారులు స్పందించకపోగా వివరాల కోసం ప్రశ్నించిన న్యూస్ తెలంగాణ ప్రతినిధిపై వెటకారంగా సమాధానం చెప్పటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రఘునాధపాలెం మండలం పుట్టకోట, కోయచిలక, పువ్వాడ ఉదయ నగర్ తదితర ప్రాంతాలలో నిత్యం అక్రమ మట్టి రవాణాపై న్యూస్ తెలంగాణ వరుస కథనాలు ప్రచురించడం జరుగుతుంది. ఈ క్రమంలో చింతకాని మండలం పందిళ్ళపల్లి పెద్ద చెరువు మట్టి తవ్వకాలపై మరియు రఘునాధపాలెం మండలాలలో జరిగే మట్టి దందాపై సాక్షాత్తు జిల్లా అధికారిని ప్రశ్నించిన ఆశించిన సమాధానం రాకపోగా మట్టి మాఫియా కు వత్తాసు పలికే విధంగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రఘునాథపాలెం గుట్టల్లో మట్టి తవ్వకాలపై వాట్సాప్ ద్వారా సమాచారం అందించినప్పటికీ పూర్తి మేరచర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా మీరు ఎవరు మీకేం సంబంధం వార్త రాస్తే రాసుకోండి మామూలే కదా అని వ్యాఖ్యానించటం పట్ల అధికారుల పనితీరును స్పష్టం చేస్తుందని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. కాగా గురువారం ఉదయం ఓ టిప్పర్ కు మైనింగ్ శాఖ అధికారులు 4272 రూపాయల పెలాల్టీ విధించగా క్షణాలలో పెనాల్టీ చెల్లించిన మట్టి మాఫియా గంటలోనే మళ్లీ మట్టి తవ్వకాలకు పాల్పడటం విశేషం. ఈ విషయంపై ఏడిని ప్రశ్నించగా గుట్టల దగ్గర కాపలా ఉండాలా.? మాకు వేరే పనులు లేవా? అంటూ దురుసుగా ప్రవర్తించడం పట్ల మట్టి మాఫియాలో సంబంధిత అధికారికి కూడా వాటాలు ఉన్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మట్టి మాఫియాను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అంటున్నారు.

0Shares

Related posts

పోతుగల్ లో గొర్ల మందపై కుక్కల దాడి

News Telangana

ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలవాలని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

News Telangana

రేపటి నుంచి 3 రోజులు వైన్ షాపులు బంద్

News Telangana

Leave a Comment