September 8, 2024
News Telangana
Image default
Telangana

రఘునాథ పాలెం లో లోకాయుక్తా అధికారి పర్యటన

  • పూర్వం అక్రమ మట్టి తవ్వకాలపై విచారణ
  • అదే స్థలంలో నేషనల్ హైవేకు అనుమతి
  • ప్రస్తుత మైనింగ్ అధికారులకి మాత్రం విధులపట్ల ఏ మాత్రం చిత్త సుద్ది లేదు అంటున్న సంఘాల నాయకులు ఎవరైనా సమాచారం ఇస్తే చాలు వారి నెంబర్లు బ్లాక్ లో పెడుతున్న అధికారులు
  • గతంలో బద్రు నాయక్ ఫిర్యాదు పై అక్రమార్కులకు ఫైన్
  • అధికారుల సమన్వయ లోపం తోనే సమస్యలు

  • ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూలై 10 (న్యూస్ తెలంగాణ) రాఘనాథపాలెం మండలం చింత గుర్తి, కోయ చెలక రెవెన్యూ గ్రామాల పరిధిలోని పీర్ల గుట్టను అనుమతులకు మించి అక్రమంగా తవ్వి , మట్టిని తరలించుకొని పోతున్న విషయమై వచ్చిన ఫిర్యాదు పై గతంలో నే విచారణ తలపెట్టిన లోకాయుక్త విచారణ అధికారి మ్యాత్యు కోషి బుధవారం నాడు రఘునాథపాలెం మండలంలో మరోసారి పర్యటించారు. గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉండగా , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపిన సందర్భంగా పైన్ విధించిన ఉదంతం విధితమే . కాగా ప్రభుత్వం మారిన మారని అక్రమార్కుల వైఖరి , అధికారుల సమన్వయ లోపం కారణంగా నేషనల్ హైవే కోసం పీర్ల గుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు పక్క దారి పడుతున్న విషయమై మరోసారి విచారణ నిర్వహించడానికి రఘునాథపాలెం మండలం లో పర్యటించి , ఆయన విచారణ చేపట్టారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ , ఏడి మైన్స్ , మండల తాసిల్దార్ , సర్వేయర్ లు వెంట రాగా లోకాయుక్త విచారణ అధికారి మ్యాత్యూకొషి విచారణ తలపెట్టారు. స్థానిక వివిధ శాఖ అధికారులు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అనుమతులు ఇచ్చారు ? అనే విషయంపై స్పష్టంగా వివరణలు ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అక్రమ మట్టి రవాణా జరగకుండా అనుమతి ఇచ్చిన చోట కాకుండా మరోచోట త్ర వ్వకాలు జరగకుండా ,సరిహద్దులను నిర్ణయించి , చెక్ పోస్ట్ లను ను ఏర్పాటు చేయాలని తన వెంట వచ్చిన అధికారులను ఆయన సూచించారు. ఈ సందర్భంగా లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రూ నాయక్ మాట్లాడుతూ కొందరు అక్రమార్కులు మట్టి మాఫియాగా తయారై , ఒక చోటా అనుమతులు తీసుకొని మరోచోట అక్రమంగా మట్టిని త్రవ్వుతూ తరలించు కొని పోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా అధికారులు సమన్వయ లోపంతో మిన్న కుండి పోతున్నారని విమర్శించారు. గతంలోనే ఫైన్ వేసినప్పటికీ , నేషనల్ హైవేకు అప్పగించిన అక్రమార్కుల వైఖరి ఏ మాత్రం మారలేదని , లోకాయుక్త తో పాటు స్థానిక మైన్స్ , సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ , తాసిల్దార్ వంటి అధికారులు దీనిపై దృష్టి సారించి , తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడి సమస్యలను పరిష్కరించకుండా కొత్తా గా అనుమతులు మంజూరు చేయకూడదని పేర్కొన్నారు . ఇదిలా ఉండగా ఇక్కడ తమకు భూములు ఉండగా తమ భూముల్లో కూడా అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారని , సరిహద్దులను నిర్ణయించడంలో అధికారులు విఫలం చెందుతున్నారని ఫలితంగా తాము అనేక సమస్యలు ఎదుర్కోవటంతో పాటు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితులు ఖాజా అబ్దుల్ రెహమాన్ , జావిద్ పాషా , జూనెద్ పాషా , ముజా హిద్ పాషా, వహీద్ పాషా లు లోకాయుక్త విచారణ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రెహమాన్ , ఉపేంద్ర బాయి, డి. నాగేశ్వరరావు, షేక్.నజిమా , కిషన్ నాయక్ ,రవీందర్ నాయక్ ,వీరన్న నాయక్ పాల్గొన్నారు.
0Shares

Related posts

దర్గా డెవలప్మెంట్ కంటూ పలు రకాలుగా వసూళ్లకు తెగబడుతున్న సిబ్బంది

News Telangana

సిరిసిల్లలో కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుంది:ఎ.ఐ.ఎఫ్.బి

News Telangana

Anganwadi Jobs : 14000 అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే..!

News Telangana

Leave a Comment