November 18, 2024
News Telangana
Image default
Telangana

మోతే రాఘవాపురం కంకర క్వారీపై కలెక్టర్ కు గ్రీవెన్స్ లో రైతుల ఫిర్యాదు…!


న్యూస్ తెలంగాణ వార్త కద నా నికి స్పందన..!


మంగళవారం విచారణ చేయాలని సూర్యాపేట కలెక్టర్ ఆదేశం


విచారణ చేయనున్న ఆర్డీవో..!


స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం (న్యూస్ తెలంగాణ ) జూలై 22 :-
సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామ రెవిన్యూ లోని సర్వేనెంబర్ 159 161 లో 2019 2020 సంవత్సరంలో ప్రభుత్వ పొందిన వంగాల కిరణ్ గౌడ్ రైతులకు తీవ్రంగా నష్టం కలిగిస్తూ ఇష్టానుసారంగా బ్లాస్టింగ్లకు పాల్పడుతున్న వైనంపై న్యూస్ తెలంగాణ సంచలన కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. న్యూస్ తెలంగాణ వార్త కథనం సూర్యాపేట జిల్లాలో పెను సంచలన్ని సృష్టించింది. ప్రభుత్వానిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై రైతుల ఆరోపణ మేరకు న్యూస్ తెలంగాణ పలు విషయాలను సేకరించింది. సాయంత్రం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు బ్లాస్టింగ్లకు పాల్పడుతూ రైతుల వ్యవసాయం పనులకు ఆటంకం కలిగించిన వ్యవహారంపై గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ ఆర్డీవో వ్యవసాయ అధికారులు మైనింగ్ రెవెన్యూ శాఖలు క్షేత్రస్థాయిలో రైతుల పంట పొలాలను క్వారీని పరిశీలించి నివేదిక అందజేయాలని సూచిస్తూ ఆదేశించారు. గత రెండు సంవత్సరాల నుండి మండల జిల్లా స్థాయి అధికారులకు క్వారీ యజమాని చేసే ఆకృత్యాలపై ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదని భాదిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని రైతులు రైతు కుటుంబాలకు చెందిన వారు కలెక్టర్ ఫిర్యాదు చేయటంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నివేదిక అందజేయాలని కోరారు. ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు ఇటీవల పత్తి విత్తనాలను నాటినప్పటికీ భూమి నాదేనంటూ రాత్రికి రాత్రే ట్రాక్టర్ తో దున్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో మండల అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదనేఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు క్వారీ యజమాని క్వారీ పరిసర ప్రాంతాలకు చెందిన వారిని కాకుండా ఆ ఏరియాకు సంబంధం లేని వ్యక్తులను అధికారులు తనిఖీనప్పుడు పిలిపించుకొని స్టేట్మెంట్లు రికార్డులు చేసినట్లు భాధిత రైతులు ఆరోపిస్తున్నారు. నిత్యం సాయంత్రం మూడు గంటల నుండి వ్యవసాయ పొలాల నుండి ఇంటికి వెళ్ళవలసి వస్తుందని వ్యవసాయ పనులు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. అంతేకాకుండా నిరంతరంగా నడిచే క్వారీ వలన దుమ్ము ధూళితో పాటు రాళ్లు కూడా చేలల్లో పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత శక్తివంతమైన బాంబులతో బ్లాస్టింగ్లల కు పాల్పడటం వలన భయం గుప్పెట్లో వ్యవసాయ పనులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ రైతుకు చెందిన భూమి కొనుగోలు చేశానని చెప్పి వారిలోని కంకర ను అక్కడక్కడ చేలో కుప్పలుగా పోసినట్లు ఇప్పటికీ ఆ భూమిలో అదే విధంగా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కంకర క్వారీ పై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పజ్జూరి శేషయ్య పజ్జూరి నర్సయ్య పజ్జూరి రమేష్ పజ్జూరి సతీష్, పజ్జూరి లక్ష్మి తదితరులు కోరుతున్నారు.

0Shares

Related posts

Breaking news : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

News Telangana

కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొని రైతులను ఆదుకోండి

News Telangana

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్ల పై కేసు నమోదు

News Telangana

Leave a Comment