- పర్మిషన్ టైం తర్వాత కూడా అక్రమ ఇసుక రవాణా
- 4ట్రాక్టర్ లు అదుపులోకి, ఒనర్స్, డ్రైవర్స్ పై కేసు నమోదు
ఎల్లారెడ్డిపేట /న్యూస్ తెలంగాణ ఎల్లారెడ్డిపేట మండలంలో ఇండ్ల నిర్మాణానికి ఇసుక రవాణా కొరకై స్థానిక ఎమ్మార్వో అనుమతి ఇవ్వగా నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ టైం తర్వాత కూడా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్ లపై కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ మానేరు వాగు నుండి ఎల్లారెడ్డిపేట లోని పలు ఇండ్ల నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మార్వో పర్మిషన్ ఇవ్వగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రాగట్లపల్లి, పదిరా గ్రామ శివారు ల్లొ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మార్వో ఇచ్చిన పర్మిషన్ టైం తర్వాత కూడా ఇసుకను రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఓనర్ లు, డ్రైవర్లు పై కొమరె వినయ్, గ్రామం గూడెం,బత్తుల సింహాద్రి, గ్రామం బొప్పాపూర్,మామిండ్ల శ్రీనివాస్, గ్రామ అగ్రహారం,పొన్నవేని రవి,పులి శ్రీనివాస్, గ్రామ అగ్రహారం,మామిండ్ల భాస్కర్, గ్రామ అగ్రహారం,అను వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని మండల ఎస్ఐ తెలిపారు. ఇలాంటి అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హేచ్చరించారు.