మత్తు మాత్రలు మింగిన విద్యార్థిని…!
ఖమ్మం ముస్తాపనగర్ లో పి డి ఎస్ యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఆందోళన…!!
బూతులు తిట్టిన సాజిదా టీచర్…?
విద్యార్థినికిహాస్పిటల్ లో చికిత్స…!
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, న్యూస్ తెలంగాణ /జూలై 26 :-
కార్పొరేట్ చదువుల పేరా కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను ఫీజుల పేరుతో డొనేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్న ప్రతి ఏడాది అందుకు తగిన చర్యలు విద్యాశాఖ తీసుకోకపోవడం ఒకవైపున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఖమ్మం ముస్తాప నగర్ ప్రాంతానికి చెందిన తొమ్మిదవతరగతి విద్యార్థిని ని శ్రీ చైతన్య పాఠశాల టీచర్ రావే పోవే అంటూ విద్యార్థుల ముందు బూతు పురాణము మొదలుపెట్టడంతో ఓ విద్యార్థిని మనస్థాపానికి గురై నిద్ర మాత్రలు మింగి అపస్మార క స్థితిలోకి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ప్ప్రైవేట్ హాస్పటల్ కు తరలించి వైద్యసికిస్తా అందిస్తున్నట్లు తల్లిదండ్రులు అంటున్నారు. ఈనెల 24న టీచర్ మందలించడంతో మత్తు మాత్రలు మింగిన బాలిక ఉదయం పూట నోట్లో నుండి నురగలు రావడంతో గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెంది హాస్పిటల్లో చేర్పించిన వైనం. కాగా న్యూస్ తెలంగాణ సేకరించిన వివరాల ప్రకారం ముస్తఫా నగర్ ప్రాంతానికి చెందిన పాఠశాలలో టీచర్ గా పని చేసే సాజిదా టీచర్ విద్యార్థిని డిక్షనరీ కొనుక్కునే నిమిత్తం పాఠశాల పక్కన ఉన్న బుక్ స్టాల్ కు వెళ్లి తీసుకొని కొంచెం ఆలస్యంగా రావడంతో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినినిటీచర్ విద్యార్థినీ విద్యార్థుల ముందు మందలించడంతో మనస్థాపానికి గురైన బాలిక మత్తు మాత్రలు మింగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు ముస్తాపనగర్లోని శ్రీ చైతన్య పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి చర్చలు జరుపుతున్నారు.