- రైస్ మిల్లుల వృధా నీరు రోడ్ల చెంతకు
- ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
- కోదాడ టూ ఖమ్మం ప్రధాన రహదారిపై నరకయాతన పడుతున్న వాహనదారులు
- శ్రీ వసుంధర, సిరి రైస్ మిల్లులపై ప్రయాణికుల కన్నెర్ర
- గాడ నిద్రలో అధికార యంత్రాంగం
- నెలలు తరబడి నీళ్లు రోడ్లపైకి చేరుతున్న పట్టించుకోని అధికారులు
న్యూస్ తెలంగాణ ప్రత్యేక కథనం
సూర్యాపేట జిల్లా బ్యూరో ( న్యూస్ తెలంగాణ ) అక్టోబర్ 20: – నిత్యం రద్దీగా ఉండే కోదాడ – ఖమ్మం ప్రధాన రహదారి వద్ద కోదాడ సమీపంలో శ్రీ వసుంధర రైస్ ప్రొడక్షన్స్ మరియు సిరి రైస్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ రైస్ మిల్లుల నిర్వాకంతో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ప్రధానంగా రాత్రి వేళలో ప్రయాణించాలంటే నీరు వలన దెబ్బతిన్న రోడ్ల గుంటలలో పడి వాహనదారులు అప్పుడప్పుడు ప్రమాదాల పాడిన పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. బహిరంగంగా రోడ్లపైకి చేరే మురికి నీళ్లతో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్న గాని సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు సైతం కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై శ్రీ వసుంధర రైస్ ప్రొడక్షన్స్ యజమానిని న్యూస్ తెలంగాణ ప్రతినిధి వివరాలు కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేకుండా ఉన్నారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యం మూలంగా నిత్యం ప్రజలు మురికి నీటి మధ్య దుర్వాసనను పిలుస్తూ నరకయాతన అనుభవిస్తూ ప్రయాణం కొనసాగించాల్సి వస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా లేదా అని కోదాడ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎంఆర్ బియ్యం గొల్ మాల్ .. ? తదుపరి కథనం తో మి న్యూస్ తెలంగాణ