- ఆలయం మూసివేసి భక్తులకు ఇబ్బందులు
- ప్రశ్నించిన కాలనీ కమిటీ,ధర్మకర్తలపై దురుసు ప్రవర్తన
- మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫీర్యాదు చేసిన ధర్మకర్త పోన్నం తరుణ్ గౌడ్,కాలనీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్
మేడిపల్లి, అక్టొబర్21(న్యూస్ తెలంగాణ) :- సాయి మారుతి నగర్ లో ఆలయ కమిటీ ముసుగులో ప్రభుత్వ ఉద్యోగి అయిన దేవాలయ నిధుల దుర్వినియోగం చేస్తున్నారని శ్రీశ్రీరామాంజనేయస్వామి
ఆలయ ధర్మకర్త పోన్నం తరుణ్ గౌడ్,సాయి మారుతి నగర్ కాలనీ కాలనీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్ ఆరోపించారు.సోమవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ పరిధిలోని సాయి మారుతి నగర్ కాలనీలోని శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ దేవాలయ నిధుల దుర్వినియోగంపై కాలనీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, కాలనీ వాసులతో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ సంధర్భంగా మీడియా సమావేశంలో ఆలయ ధర్మకర్త పొన్నం తరుణ్ మాట్లాడుతూ సాయి మారుతి నగర్ కాలనీలోని శ్రీశ్రీరామాంజనేయస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ తన ఇష్టానుసారంగా కాలనీ కమిటీకి ఎలాంటి సమాచారం లేకుండా ఆలయ పూజారులను మారుస్తూ నేడు ఆలయాన్ని పూజలు లేకుండా పూర్తిగా తాళం వేశాడని,అతని వైఖరి పై హిందూవాదులుగా ఖండిస్తూ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు ఫోన్ చేయగా వెంటనే తీస్తున్నామని చెప్పి ఇప్పటికీ తాళాలు తీయకపోవడం హిందూ ధర్మానికి విరుద్ధమన్నారు. ఆలయ నిర్మాణంలో భాగంగా తన తండ్రి పొన్నం మురళిగౌడ్ అన్నివిధాలుగా చేయుతనిస్తూ తమ సొంత భూమిని ఆలయ నిర్మాణానికి ఇచ్చామని తెలిపారు.ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ఆలయ ధర్మకర్తగా రెండు మూడు లక్షల రూపాయలు విరాళంగా అందజేస్తామన్నారు.గత రెండు సంవత్సరాల నుండి ఆలయ అధ్యక్షుడు సత్యనారాయణ గతంలో కాలనీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడంతో తొలగించడంలో కక్షగా ఆలయ ధర్మకర్త అయిన తమ కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం లేదని అన్నారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు పదవిని అడ్డం పెట్టుకొని దేవాలయ బ్రహ్మోత్సవాల పేరుతో ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన ఆరోపించారు.అనంతరం కాలనీ కమిటీ మాట్లాడుతూ దేవాలయానికి సంబందించిన ఆదాయ వ్యయం లెక్కల వివరాలను అడిగితే చెప్పకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని,ఆలయానికి సంబందించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సత్యనారాయణ గతంలో కాలనీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు చట్ట విరుద్దంగా దేవాలయానికి సంబందించి సేకరించిన విరాళాలను తన స్వంత ఖాతాలోకి వేసుకున్నాడన్నారు.అతని ప్రవర్తన మార్చుకోవాలని గతంలో కాలనీవాసులు పదవి నుండి తీసివేస్తే దేవాలయ కమిటీ పేరుతో సేకరించిన నిధుల వివరాలు తెలపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దుర్వినియోగం చేస్తున్నాడని తెలిపారు. దీనిపై రిటైర్డ్ దేవాదాయ శాఖ అధికారితో ఆదాయ వ్యయాలపై విచారణ చేయిస్తే లక్షల రూపాయల నిధుల తప్పుడు లెక్కలు చూపించి తన స్వప్రయోజనాలకు వాడుకున్నాడని ఆరోపించారు.ఇప్పటికైనా దేవాలయ కమిటీ ఆలయ ఆదాయ విజయాలపై ఖర్చులను చూపెట్టి ఆదాయ వ్యయాల లెక్కలు చూపెట్టాలని డిమాండ్ చేశారు.లేనిచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, కాలనీవాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.