November 18, 2024
News Telangana
Image default
Telangana

జోరు గా రిజిస్ట్రేషన్ ల దందా ..!

  • ఏ భూమి కీ ఐనా రిజిస్ట్రేషన్ తథ్యం ..!
  • సీలింగ్, అసైండ్ ల్యాండ్ అంటూ ఏ భూమి ఐనా రిజిస్ట్రేషన్ ..?
  • ఎన్నో అక్రమ రిజిస్ట్రేషన్ లకు అడ్డా..?
  • డాక్యుమెంట్ రైటర్ల చేతిలో సబ్ రిజిస్టర్ ..?
  • వసూళ్లకు అడ్డగా మారిన చంపాపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయం..?
  • ( పూర్తి ఆదారాలతో “న్యూస్ తెలంగాణ దినపత్రిక” లో వరుస సంచలనాత్మక కథనాలు )

న్యూస్ తెలంగాణ ఎడిటర్ ప్రత్యేక కథనం : – రిజిస్ట్రేషన్ శాఖ రోత పుట్టించే శాఖగా తయారైంది. అక్కడ అంతా డాక్యుమెంట్ రైట్లర్లదే హవా వారు ఎంత చోబితే అంత నడవడాల్సిందే…! కాదు అని నేరుగా వెళితే అంతే గతి ఆ పని కాదు కథ ఏ పని కోడా అవ్వకుండా చెయ్యడమే అధికారులు తీరు. వివరాల్లోకెళ్తే రంగారెడ్డి జిల్లా పరిధిలోని చంపాపేట్ సబ్ రిజిస్టార్ కార్యాలయం వసూళ్లకు అడ్డాగా మారింది. అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు తిలా పాపం తలా పిడికెడు అనేలా వ్యవహరిస్తున్నారు. సూటు బూటు వేసుకునే వారికి ఒక రేటు, పంచ కట్టు అమాయకులకు ఒక రెటు లా వ్యవహరిస్తున్నారు. సూటు బూటు వేసుకొని ఎవరైనా కార్యాలయానికి వస్తే ఆ కార్యాలయ సిబ్బంది చేసే మర్యాదలు చూస్తే మతి పోవాల్సిందే. అక్కడ అంతా డాక్యుమెంట్ రైటర్లు పెట్టిన రేటు కే కట్టుబడి వుండాల్సిందే. డాక్యుమెంట్ రైటర్లు నుంచి ఒక డాక్యుమెంట్ సబ్ రిజిస్ట్రార్ చేతికి చేరింది అంటే ఆ డాక్యుమెంట్ వాస్తవమా? కదా? అనేది కోడా చూడరు ఫటా ఫట్ పని జరిగిపోతుంది. కార్యాలయం మాటున దుకాణాల తో కల కల లాడుతూ ఆన్లైన్ లొసుగుల తో వివాదం ఉంటే ఓ రేటు లేకుంటే మరో రేటు బహిరంగంగానే ఫిక్స్ చేసుకుంటూ పని చేస్తుంటారు. ఇదంతా ఇలా వుంటే సబ్ రిజిస్ట్రార్ ఓ రూల్ కోడా పెట్టుకున్నారు అని బహిరంగ చర్చించుకోవడం అక్కడ విశేషం. సబ్ రిజిస్టర్ పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే మరి తిప్పలు తప్పవు. కార్యాలయం లో అంతా అవినీతే ? కార్యాలయం సిబ్బంది సైతం భారీగా చేతివాటం చూపించడం అంతా మా ఇష్టం అన్న వ్యవధిలో ఇంత అవినీతి నడుస్తున్న కోడా అధికారులు మాత్రం తూతూ మంత్రంగా పర్యవేక్షణ చేపడుతున్నారు. ప్రజలు తమ భూ స్థలాన్ని వ్యవస్థలో అత్యంత పటిష్టమైన స్థిరాస్తి భద్రత కోసం ఏర్పాటు చేయబడిన విధానం రిజిస్ట్రేషన్ విధానం. ఈ రిజిస్ట్రేషన్ విధానంలో ఓ వ్యక్తి తనకంటూ వున్న సొంత అస్తిని ప్రభుత్వ రాజముద్రతో సగర్వంగా తనదంటూ చెప్పుకునేందుకు చేయబడిన ఈ రిజిస్ట్రేషన్ విధానం లో తన భూమి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తూ ఈ భూమి నాది అంటూ రిస్జిస్ట్రెషన్ కొరకు వస్తె ఇది లేదు అది లేదు అంటూ చిరాకు పడుతుంటారు. ముడుపులు చెల్లించినట్లయితే ఒకలాగా లేని చో మరోలాగా వ్యవహరించడం ఇక్కడ విశేషం. అది ఏమి తెలవని అభాగ్యులు వారి చెప్పే ప్రాసెస్ తెలవదు అంటు మబ్బు గా చూసి అయ్యా మీరు ఏం అయినా చేయండి అన్నది మొదలు ప్రభుత్వానికి సంబంధించిన పలు పన్నులు చెల్లించినప్పటికీ డాక్యుమెంట్ చార్జెస్ అని అది తక్కువ అయింది ఇది తక్కువ అయింది అని ముచ్చేమటలు పెట్టిస్తారు. నిస్సహాయత లో వున్న ఆ బాధితులు తప్పక కార్యాలయ సిబ్బందికి సైతం ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి. అదే ఎవరైనా వెంచర్ యజమాని వస్తే మాత్రం గంటలు గంటలు గా కూర్చో పెట్టుకొని పనులు చక చక చేసి తనదేనంటూ చేసి పంపుతారు. రాజ్యాంగంలో అందరూ సమానులే అని మరి ఇంకెప్పుడు గుర్తిస్తారో. రిజిస్ట్రేషన్ శాఖకి రోత పుట్టిస్తున్నారని, ప్రభుత్వానికి తలంపులు తెచ్చేలా ఈ చంపాపేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వసూళ్లు దందా ఉందని పలువురు పేర్కొంటున్నారు.

0Shares

Related posts

కామారెడ్డి ఆరో రౌండ్.. రేవంత్ ముందంజ

News Telangana

చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకున్న కెసిఆర్ దంపతులు

News Telangana

జాతర ఏర్పాట్లను పరిశీలించిన డి.ఎస్.పి

News Telangana

Leave a Comment