- ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా మల్లేపంగు సూరిబాబు మాదిగ, రెండొవ సారి ఏకగ్రీవ ఎన్నిక
సూర్యాపేట జిల్లా బ్యూరో చిలుకూరు నవంబర్ 17: ( న్యూస్ తెలంగాణ ) :- మండలకేంద్రంలో ఆదివారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఎమ్మార్పీఎస్ , ఎం ఎస్ పి మరియు అనుబంధ సంఘాల నూతన పునర్నిర్మాణ మండల కమిటీ ఎన్నిక సమావేశం ఎం వారి ఎస్ పి రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ, అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి
ముఖ్య అతిథిలుగా ఎం.ఎస్.పి జిల్లా కో ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ బోడ సునీల్ మాదిగలు పాల్గొని మాట్లాడుతూ
మహా జననేత మానవతా ఉద్యమాల పితామహుడు మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ. నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాతనే మాదిగ జాతికి ఆత్మగౌరవం, గుర్తింపు వచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మొదలైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం లక్ష్యసాధన కోసం ఏకంగా భారత ప్రధానమంత్రిని కూడా కదిలించిన చరిత్ర ఉందని అన్నారు.ఎమ్మార్పీఎస్ డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణలో ఉన్న న్యాయబద్ధతను గుర్తించిన సుప్రీంకోర్టు ఆగష్టు 1 వ తేదీన ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లోకి తీసుకురావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి. మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగ జాతికి అన్యాయం చేస్తున్నాడని అన్నారు. నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకువచ్చే మొదటి రాష్ట్రం తెలంగాణను నిలబెడుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీని విస్మరించి మాదిగ జాతికి నమ్మిక ద్రోహం చేశాడని అన్నారు. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు 11062 టిచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగలకు ముఖ్యమంత్రి అన్యాయం చేశాడని అన్నారు.కనుక ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాదిగ బిడ్డలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమ పునర్నిర్మాణంలో మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు యువకులు పెద్ద భాగస్వాములు కావాలనీ పిలుపునిచ్చారు.
ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మల్లేపంగు సూరిబాబు మాదిగ,
ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి, వేముల భార్గవ్, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు వేముల అశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్ కార్యదర్శి కందుకూరి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ సహాయ కార్యదర్శి కందుకూరి రామారావు మాదిగ, ఈ కార్యక్రమం లో కందుకూరి లచ్చయ్య, సిద్దెల పిచ్చయ్య,ముదిగొండ గురవయ్య, మల్లేపంగు మహేష్, ముదిగొండ అంజి, వడ్డేపల్లి సిద్ధూ తదితరులు పాల్గొన్నారు,