News Telangana : కర్నె శిరీష అనే తన పేరును జీవితం బర్రెలక్కగా మార్చింది. నిరుద్యోగుల తరఫున గళమెత్తేందుకు కాలం ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉసిగొల్పింది. కొల్లాపూర్ నుంచి హేమాహేమీ అభ్యర్థుల మధ్య పోటీలో నిలిచిన ఆమె పోస్టల్ బ్యాలెట్లో అగ్రస్థానంలో నిలిచినా ఈవీఎం ఓట్లలో 4వ స్థానానికి పరిమితమై మొత్తంగా 5,754 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో ఓడినా యావత్ ప్రజల మనసు గెలిచారంటూ బర్రెలక్కను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
previous post