- మహేందర్ రెడ్డి డ్రైవర్ కారు తో పరారు
- సీసీ పుటేజిల ద్వారా కుంబాల మహేందర్ రెడ్డి కారు గా గుర్తింపు
- వృద్ధుడి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలింపు
ముస్తాబాద్ /న్యూస్ తెలంగాణ :- మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిఎ కుంభాల మహేందర్ రెడ్డి కారు ముస్తాబాద్ మండలంలో వృద్ధుడి ని ఢీకొట్టగా గాయలై ఆస్పత్రికి తరలింపు.
- పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నారాయణరావుపేట మండలం బంజపల్లి గ్రామానికి చెందిన దొందడి మల్లయ్య బదనకల్ స్టేజ్ వైపు ద్వి చక్ర వాహనం పై వస్తుండగా మల్లయ్య కు క్రేట కారు ఢీ కొట్టగా కుడి కాలు విరిగింది. ప్రస్తుతం మల్లయ్య సిరిసిల్ల లోని సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా పారిపోగా ముస్తాబాద్ పోలీసులు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా గుర్తించిన ( టీఎ.స్.09. ఈ.యు.6008) నంబర్ ప్రమాదానికి కారణమైన కారు మాజీ మంత్రి కెటిఆర్ పి ఎ కుంబాల మహేందర్ రెడ్డి కి సంబందించిన కారు గా గుర్తించినట్లు సమాచారం. ప్రమాద సంఘటన పై బాధిత కుటుంబం ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.