న్యూస్ తెలంగాణ తెలుగు దినపత్రిక వనపర్తి జిల్లా ప్రతినిధి.. (కానమోని ఆంజనేయులు)
వనపర్తి జిల్లా కేంద్రం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా న్యూస్ తెలంగాణ ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి శుక్రవారం ఆవిష్కరించారు. న్యూస్ తెలంగాణ వనపర్తి జిల్లా స్టాప్ రిపోర్టర్ కానమోని ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మీడియా ఎల్లప్పుడూ నిజం వైపు, ప్రజల వైపు ఉండాలని, సమాజంలో నాలుగో స్తంభంగా ముఖ్య పాత్ర పోషిస్తుందని మీడియాకు ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు,ఈ కార్యక్రమంలో న్యూస్, తెలంగాణ వనపర్తి జిల్లా రిపోర్టర్స్ పాల్గొని ఈ సందర్భంగా తమ అతిథిగా భావించి ఆదిత్యాని ఇచ్చి మీడియాకు గౌరవాన్ని ఇచ్చినటువంటి వనపర్తి జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలియజేశారు