September 8, 2024
News Telangana
Image default
Telangana

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్

  • అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు
  • గైడ్లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లయ్ ఆఫీసర్లు బిజీ
  • రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు.. మహిళల పేరుతో 70 లక్షలు

హైదరాబాద్ : మహాలక్ష్మి పథకం కింద గ్యాస్‌ సిలిండర్ను రూ.500కు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా సివిల్‌ సప్లయ్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు గైడ్లైన్స్ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు. కస్టమర్లు ఎంత మంది ఉన్నారు.. ఎవరికి వర్తింప జేయాలి.. ప్రభుత్వంపై పడే భారం ఎంత..? అనే లెక్కలు తీస్తున్నారు. రాష్ట్రంలో ఒక కోటి 20 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపు రూ. 3 వేల కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

‘రూ. 500కే సిలిండర్’ స్కీమ్కు గైడ్లైన్స్ రూపొందించే పనిలో సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. కుటుంబ యూనిట్‌గా తీసుకోవాలా.. లేక మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలా.. అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది. కేవలం మహిళల పేరుతో గ్యాస్‌ కనెక్షన్లను లెక్కలోకి తీసుకుంటే.. అవి 70 లక్షల వరకు ఉన్నాయి. ఒక వేళ సర్కారు మహిళలకే ఇవ్వాలని మార్గదర్శాలు ఇస్తే గ్యాస్‌ కనెక్షన్లలో ‘నేమ్‌ చేంజ్‌’ అనే ప్రొవిజన్‌ ఉండటంతో మిగతా కనెక్షన్లన్నీ మహిళల పేరుపై మార్చుకోవడానికి ఎల్పీజీ డీలర్ల వద్ద కస్టమర్లు క్యూ కట్టే చాన్స్ ఉంది. మహిళల పేరుమీదున్న కనెక్షన్లకే రూ. 500కు సిలిండర్ అని మార్గదర్శకాలు రూపొందించినా.. మిగతావాళ్లు కూడా ‘నేమ్ చేంజ్’ ఆప్షన్ను ఉపయోగించుకుంటారన్న వాదన వినిపిస్తున్నది.

0Shares

Related posts

ఎవ్వరిని వదిలిపెట్టేదే లేదు: కేఏ పాల్

News Telangana

రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి

News Telangana

నేడు పోచంపల్లిలో ద్రౌపది ముర్ము పర్యటన

News Telangana

Leave a Comment