January 16, 2025
News Telangana
Image default
PoliticalTelangana

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో సోనియా గాంధీ?

హైదరాబాద్, ( News Telangana ) :-
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పొలిటి కల్ ఆఫైర్స్ కమిటీ తీర్మానిం చిన కాఫీలు ఢిల్లీకి చేరాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్ర టరీ కేసీ వేణుగోపాల్‌కు అందజేశారు. సోనియా గాంధీ పోటీపై ప్రధానంగా ఇరువురు నేతలు చర్చించారు. ఒప్పిస్తానంటూ రేవంత్‌కు కేసీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సోనియాకు ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే ఆసక్తి లేకపోతే తెలంగాణ కోటా నుంచి రాజ్యసభ సీటును పొందాలని రేవంత్ కేసీకి రిక్వెస్టు చేశారు. అగ్రనేతతో చర్చించి నిర్ణయం చెబుతానని కేసీ క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాలనేది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇప్పటికే పవర్ లోకి తీసుకువచ్చి థాంక్స్ చెప్పిన పార్టీ.. త్వరలో సోనియా గాంధీని తెలంగాణ నుంచి ప్రతినిత్యం వహించే అవకాశం ఇవ్వాలనేది నేతల అభిప్రాయం. సీఎం రేవంత్ ప్రత్యేక ఇంట్రస్ట్‌తో ఈ నిర్ణయాలు తీసుకున్నారు

0Shares

Related posts

రేషన్ షాపులను తనిఖీ చేసిన జిల్లా పౌర సరఫరాల అధికారి

News Telangana

‘ధరణి’పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విమర్శలు

News Telangana

CM Jagan: రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

News Telangana

Leave a Comment