January 17, 2025
News Telangana
Image default
Andhrapradesh

తిరుమల నడక దారిలో మరో చిరుత సంచారం

తిరుపతి ప్రతినిధి ( News Telangana ) :- భ‌క్తుల‌ను చిరుత భ‌యం మ‌ళ్లీ ప‌ట్టుకుంది. ఇటీవ‌ల కాలంలో అలిపిరి నుంచి తిరుమ‌ల‌కు వెళ్లే న‌డ‌క‌దారి లో చిరుత‌ల సంచారం ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో అలిపిరి న‌డ‌క‌దారిలో చిరుత సంచారం మ‌ళ్లీ శ్రీ‌వారి భ‌క్తుల‌కు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుంది. అలిపిరి మార్గంలో ఉన్న నరసింహ స్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో చిరుత క‌నిపించ‌డంతో భక్తులందరూ, ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే టీటీడీ అధికారులు అలాగే అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయిపోయారు.నడక దారిలో వెళ్లే తిరు మల శ్రీవారి భక్తులను గుంపులు గా మాత్రమే అనుమతిస్తు న్నారు. అలాగే… వారికి కర్రలు కూడా అప్పగిస్తున్నారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు

0Shares

Related posts

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌..

News Telangana

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

News Telangana

సాగర్ డ్యామ్‌ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత

News Telangana

Leave a Comment