September 16, 2024
News Telangana
Image default
Andhrapradesh

రైల్వే ఉద్యోగి ఇంట్లో రోజూ డీజేలో భక్తి పాటలు.. అనుమానంతో ఆరా తీస్తే!

  • విశాఖలో గుప్తు నిధుల తవ్వకాలు
  • స్వామీజీ చెప్పారని తవ్వేశారు
  • ఏకంగా 20 అడుగుల వరకు గొయ్యి

విశాఖలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో.. తాటిచెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వకాలు జరిపారు. రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో 20 అడుగుల గొయ్యి తవ్వేశారు. గుప్తనిధుల తవ్వకాల కోసం విజయవాడ నుంచి వ్యక్తులు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళలు వేసిన సదరు వ్యక్తులు.. దోష నివారణ కోసం పూజలు చేశామంటూ చెప్పుకొస్తున్నారు. విషయం తెలిసిన కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు కొద్దిరోజులు క్రితం ఓ స్వామీజీని ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన ఇంటి ఆవరణను పరిశీంచి.. ఓ ప్రాంతంలో వైబ్రేషన్స్ వచ్చాయి.. గుప్త నిధులు ఉన్నాయని కోటేశ్వరరావుతో చెప్పాడు. ఇంకేముంది వెంటనే ఓ గ్యాంగ్‌ను పిలిచి తవ్వకాలు చేపట్టాడు. అయితే తవ్వుతున్న శబ్దాలు చుట్టుపక్కలవారికి వినపడకుండా అతి తెలివితో జాగ్రత్తలు తీసుకున్నాడు. డీజే తీసుకొచ్చి పాటలు పెట్టేవాడు.. ఆ సమయంలోనే తవ్వకాలు జరిపేవాడు. మళ్లీ పాట ఆగిపోయిన వెంటనే తవ్వకాలు ఆపేవాడు.. మళ్లీ డీజేలో పాట ఆన్ చేసి తవ్వించేవాడని స్థానికులు చెబుతున్నారు.

తమ ఇంట్లో తవ్వకాలు జరుపుతున్నారని తెలిసి ఇద్దరు వ్యక్తులు వచ్చి మీడియా పేరుతో బెదిరించారని.. వారికి డబ్బులు కూడా ఇచ్చినట్ల కోటేశ్వరరావు తమ్ముడు చెబుతున్నారు. నెల రోజులుగా ఈ గొయ్యి తవ్వుతున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే కొన్ని పూజలు కూడా నిర్వహించినట్లు వివరించారు. ఎవరూ రాకుండా, చూడకుండా చుట్టూ అడ్డుగా చీరల్ని కట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నామని.. వారిని పిలిచి ప్రశ్నించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే స్థలంలో ఇలా తవ్వకాలు జరపడం నేరం అంటున్నారు.. అలాగే కోటేశ్వరరావును కూడా పిలిపించి మాట్లాడతామంటున్నారు. అలాగే ఆ ఇంటికి వచ్చి గుప్త నిధులు ఉన్నాయని చెప్పిన స్వామీజీల వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు.

0Shares

Related posts

మనిషిని పోలిన ముఖంతో ఓ వింత మేకపిల్ల

News Telangana

అర్టికల్ 370పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

News Telangana

తాత ఆస్తిపై మనువడే హక్కుదారుడా? అసలు విషయం తెలిస్తే షాక్‌..

News Telangana

Leave a Comment