November 20, 2024
News Telangana
Image default
Telangana

చెక్ పోస్ట్ లో నో చెకింగ్ … వసూళ్ల పర్వంలో చెక్ పోస్ట్ సిబ్బంది

  • చెకింగ్ తో పని లేదు ఓన్లీ “మనీ”
  • అక్రమ వసుల్లె ద్యేయంగా పనిచేస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఆర్టిఏ చెక్ పోస్ట్
  • భారీగా చేతి వాటం చూపిస్తున్న చెకపోస్ట్ సిబ్బంది
  • కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది
  • చెకపోస్ట్ వారు పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే కొర్రీలే
  • జిల్లా అధికారుల పర్యవేక్షణ కరువు తూతూ మంత్రంగా తనిఖీలు
  • చెకపోస్ట్ పేరిట భారీగా దందా చేస్తున్నప్పటికి
  • ఇదంతా జిల్లా అధికారికి తెలవదా అంటున్న బాధిత లారీ డ్రైవర్లు ?
  • స్టేట్ బ్యూరో, మార్చి19 (న్యూస్ తెలంగాణ ) :- నో చెకింగ్ ఓన్లీ “మనీ” చెకింగ్ తో మాకు పని లేదు ముడుపులు చెల్లించండి చెక్ పోస్ట్ దాటండి అంటూ భారీగా చేతి వాటం చూపిస్తున్న చెకపోస్ట్ సిబ్బంది. చెకపోస్ట్ వారు పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే కొర్రీలే. చెకపోస్ట్ పేరిట భారీగా దందా చేస్తున్నప్పటికి ఇదంతా జిల్లా అధికారికి తెలవదా? నామ మాత్రం కె తనిఖీలు అనేది వట్టి మాట అసలు మా దగ్గర తనిఖీలే ఉండవు. నా చెక్ పోస్ట్ కి నేనే రాజు నా రూల్స్ నా ఇష్టం నేను ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్టిఏ అధికారులు. ఏ ఒక్క ఆర్టిఏ సిబ్బంది కూడా వెళ్లి నేరుగా లారీని ఆపిన దాకలు లేవు చిన్న వాహనాలను సైతం పిండి కొద్ది రోటి అన్నట్లుగా రేట్ ఫిక్స్ చేసి పెట్టారు లారికి అయితే 300 నుంచి 1000 రూపాయలు చిన్న వాహనాలకి 200 నుంచి 500 వరకు వసూళ్లు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సైతం వదలకుండా వచ్చినకడికి దోచుకునే విధంగా ఆర్టీవో సిబ్బంది వ్యవహరిస్తున్నారు కనీసం ఆర్టిఏ సిబ్బంది వాహనంలో ఏమున్నదో పక్కన పెడితే కనీసానికి వాహనానికి పేపర్స్ ఉన్నవా లేవా అని సైతం చెక్ చేయడానికి సిబ్బందికి తీరికలేదు. అక్రమ వసులతోనే టైం సరిపోతుంది అక్కడ ఆర్టిఏ కి ఇచ్చే లంచం కాకుండా కానిస్టేబుల్స్ సైతం ఆ లారీ డ్రైవర్లని పిడుస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ బాధిత లారీ డ్రైవర్లు వాపోతున్నారు ఇలా చూసుకున్నట్లయితే వాహనాల్లో చెక్ చేయడానికి మరి వాహనంలో ఏమున్నది ఏమొస్తుంది అని ఎవరు చెక్ చేయాలి. ఇలా అసమర్థత డిపార్ట్మెంట్ మరి అవసరమా లక్షల రూపాయల జీతాలు అవి చాలక రోజుకు ఒక్కో అధికారికి ఒక్కో బ్యాగు గవర్నమెంట్ సొమ్ముకి చిల్లు పెడుతున్న ఆర్టిఏ అధికారులు. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం. రీజనల్ ట్రాన్స్ఫోర్ట్ ఆఫీసర్ (DTO) కనుసనల్లో జరుగుతున్నట్లు సమాచారం. వీరికింత వారికంత అన్నట్లుగా వ్యవహారం. అంతేకాకుండా ఆర్టిఏ అధికారులు పర్సనల్గా ఒక గుమస్తాని సైతం ఏర్పరచుకున్నారు ఈ అమ్యామ్యాల యవ్వారం చూడడానికి అని విశ్వసనీయ సమాచారం. ( తరువాయి భాగం వేచి చూడండి త్వరలో న్యూస్ తెలంగాణ )
0Shares

Related posts

సంక్రాంతి పండగ సందర్బంగా క్రికెట్ టోర్నమెంట్

News Telangana

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ?

News Telangana

అధిష్ఠానానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు

News Telangana

Leave a Comment