- ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందాను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం.
- ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
- డీఈవో ఎంఈఓ పోస్టులు భర్తీ చేయక పాఠశాల విద్య పర్యవేక్షణ ఎలా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
- ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా //న్యూస్ తెలంగాణ
ఏబీవీపీ రాష్ట్ర శాఖ జూన్ 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యాసంస్థల బంద్ కి పిలుపునిచ్చిందని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ…. సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యలపైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు లేక సరిపడ అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతుంటే మరొకవైపు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీజులు దందుకుంటున్న వైనం ఇవేవీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం చర్యలు తీసుకుంటామంటూ హామీలు ఇస్తూ చేతులు దులుపుకుంటుంది. అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలపైన చర్యలు తీసుకుంటామంటూ, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడిని అరికట్టడంలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల జూన్ 26వ తేదీన పాఠశాల బంద్ కు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిందని తెలియజేశారు.
అన్ని పాఠశాలల యాజమాన్యాలు బంద్ కు సహకరించి, బంద్ ని విజయవంతం చేయాలని కోరారు.
1 ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షలకు, లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.
- ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి.
3 నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి.
- 6. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. వెంటనే %ణజురా, వీజులా% అధికారులను నియమించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న మధ్యాహ్నభోజనంలో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి, నాణ్యతలేని ఆహారాన్ని
అందిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలి మరియు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.
- మెగా డీఎస్సీ ద్వారా 24 వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి.
భవదీయ
- ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ మరియు స్యావెంజర్లను నియమించాలి.
- విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి.
ఈ కార్యక్రమం లో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ టౌన్ సెక్రటరీ శివసాయి sfd కన్వీనర్ లోపెల్లి రాజు రావు ఎలాగందుల శ్రీనివాస్ కాసారపు నితిన్ అనిల్ గౌతమ్ సాయి పవన్ జగన్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు