October 18, 2024
News Telangana
Image default
Telangana

ట్రాక్టర్లు లీజుకి ఇస్తే… నకిలీ పత్రాలతో కాజేశారు…?

గత రెండు నెలలుగా… నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సూర్యాపేట రూరల్ సీఐ..?

యజమానులు లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు..?

సూర్యాపేట ఆర్టిఏ కార్యాలయంలో అవినీతి దందాలెన్నో…?

సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఆదేశించిన.. పట్టించుకోని పోలీస్ యంత్రాంగం…?

చివ్వె0ల పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేసినా గాని కేసు నమోదుకు జాప్యమేల…?

దురాజ్ పల్లి.. టాక్టర్ వ్యవహారంలో వెలుగు చూస్తున్న నిజాలెన్నో…?

స్టేట్ బ్యూరో , (న్యూస్ తెలంగాణ) :- సూర్యాపేట జిల్లా చివ్వెoల మండలం దురాజ్ పల్లి తెల్ల బండ కాలనీకి చెందిన రాపాని రాజ్యమ్మ తన టాక్టర్ను నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కొత్త బావి గ్రామానికి చెందిన జబ్బు నరసింహారావు అనే వ్యక్తికి సిమెంటు ఇటుకలను తరలించడానికి(తోలడానికి) నెలకు 30 వేల రూపాయలు చొప్పున లీజుకు తీసుకున్న సదరు వ్యక్తి రెండు మూడు నెలలు లీజును చెల్లించి తరువాత వాయిదాలు పెట్టడం మొదలు పెట్టడంతో గట్టిగా నిలదీయడంతో కళ్ళ బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. న్యూస్ తెలంగాణ సేకరించిన వివరాల ప్రకారం రిజిస్ట్రేషన్ నెంబర్ టీఎస్ 29 టీబి6518 కాగా ఇంజన్ నెంబర్ జెడ్ కే డి 2 ఈ.బి ఎన్5818 గాను ఎం బి ఎన్ ఏ ఏ ఏ ఈ ఏయు సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖ పత్రాలు పొంది ఉన్నప్పటికీ ఎటువంటి సమాచారం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆధార్ కార్డును ఒకచోట ది.. నివాసం చర్చి కాంపౌండ్ సూర్యాపేట అడ్రస్ ను పొందుపరుస్తూ అక్రమంగా కమిషన్లకు కక్కుర్తి పడి సంబంధిత ఆర్టిఏ ఏజెంటు మరియు రవాణా శాఖ అధికారులు అడ్డగోలుగా12.01.20 24న బాధితులకు ఎటువంటి సంబంధం లేని నూతన గంటి సాంబ రాజు/రాములు కు దర్జాగా రిజిస్ట్రేషన్ నిర్వహించడం విశేషం. చేసిందే నకిలీ మకిలిల అధికారుల అండదండలతో అదే నెలలో 11 రోజులకే లీజుకు తీసుకున్న కొండా మల్లేపల్లి కొత్త బావికి చెందిన జబ్బు నరసింహ పేరున రవాణా శాఖ అధికారులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ మా ట్రాక్టర్ను కాజే చేశారంటూ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు బాధిత కుటుంబం ఇటీవల ఫిర్యాదు చేయడంతో స్పందించిన డిప్యూటీ సీఎం సూర్యాపేట జిల్లా ఎస్పీకి సిఫారసు చేస్తూ నకిలీ రిజిస్ట్రేషన్ పై విచారణ చేయాలని బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవాలని లేఖ రాయడంతో గత సోమవారం బాధిత కుటుంబం అడిషనల్ ఎస్పీని కలిసి సమ సమస్యను తెలుపగా చివ్వెంల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండి అని చెప్పటంతో బాధిత కుటుంబం చివ్వెంల స్థానిక ఎస్సై కి ఫిర్యాదు చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ జరిగిన ప్రదేశం సూర్యాపేట కాబట్టి సర్కిల్ సిఐని కలవాలని సూచించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు రాపాని శ్రీను కుటుంబం న్యూస్ తెలంగాణ ఎదుట వాపోయారు. ట్రాక్టర్ ను లీజుకి ఇస్తే అవినీతి ఏజెంట్ ద్వారా అధికారులు తమ టాక్టర్ను కాజేసినట్లు బాధిత కుటుంబం కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాగా కుటుంబ సమస్యను పోలీసులు ఇటు ఆర్టిఏ అధికారులు గత రెండు నెలల నుండి కార్యాలయల చుట్టూ తిప్పుతూ సమస్యను పరిష్కరించడం లేదని బాధతో కుటుంబం ఆరోపిస్తున్నది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆర్టిఏ జిల్లా ఎస్పీ స్పందించి గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా ట్రాక్టర్లు కాజేసిన వ్యక్తులపై అదేవిధంగా రవాణా శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు సూర్యపేట జిల్లా వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.*సూర్యాపేట రవాణా శాఖ అధికారులు.. పోలీస్ శాఖ అధికారుల వివరాలతో… రేపటి కథనంలో..!

0Shares

Related posts

Pawan Kalyan: పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

News Telangana

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి!

News Telangana

ఎన్నికల నబందనలను ఉల్లంగించిన ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు

News Telangana

Leave a Comment