- సొంతంగా ల్యాబ్, మెడికల్ నిర్వహణ.
- తన ఇంటినే వైద్యాశాల గా మార్చిన వైనం.!
- గత 5 సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న చర్యలు శూన్యం.!
- నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు వైద్యం.
- ప్రజల ప్రాణాలతో చెలగాటం, ప్రాణాలు పోతే బాద్యులు ఎవరు…?
- జిల్లా అధికారులు చర్యలు చేపడతారా..?
స్టేట్ బ్యూరో //న్యూస్ తెలంగాణ :- జిల్లాలో శంకర్ దాదా ఎంబిబిఎస్ అవతారంలో ప్రజలకు వైద్యం చేస్తూ తన ఇంటిని సైతం వైద్యశాలగా మార్చి వైద్యం చేస్తున్న ఓ వైద్యుడు..! నిబంధనలు విరుద్ధంగా ఇష్టం సారంగా ప్రజలకు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పట్టించుకోని నాథుడే కరువైంది. రోగల్లుడి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నాడని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దందా ఆగేనా అరికట్టేది ఎవరు అంటూ వేచి చూస్తున్న ప్రజలు..!! వివరాలకు వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తన ఇంటిని సైతం వైద్యశాలగా మార్చి ఇస్తానుసారంగా వైద్యం చేస్తున్న డాక్టర్ ముక్తార్. నిబంధనలు గాలికి వదిలేసి ల్యాబ్, మెడికల్, పడగల నిర్వాహన చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు.అడ్డగోలుగా ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.గత 5 సంవత్సరాలుగా ముస్తాబాద్ లో వైద్యం చేస్తున్న చర్యలు శూన్యం అంటూ… పట్టించుకునే నాధుడు కరువైందని వాపోయారు. చిన్నపాటి టాబ్లెట్లు వేసుకుంటేనే భయపడే కాలంలో ఏకంగా తన ఇంట్లోనే వైద్యశాలగా మార్చి వైద్యం చేస్తున్నాడని తెలిపారు.జిల్లా అధికారులు స్పందించి ఈ దందా ను అరికాడుతారా…? అని ప్రజలు వేచిచుస్తున్నారు..! అధికారులు ఈ దందా పై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరిన్ని కథనలతో మీ న్యూస్ తెలంగాణ లో మీ ముందుకు….!