September 8, 2024
News Telangana
Image default
National

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్‌.!

న్యూస్ తెలంగాణ డెస్క్ :- అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్‌ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్నారైలు తమ హెచ్‌-1బీ వీసాలను రెన్యువల్‌ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను డిసెంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేలా అమెరికా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంటుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ వెల్లడించారు. తొలుత 20వేల మందికి ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద వీసా రెన్యువల్‌ చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఎక్కువ శాతం భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని జూలీ వెల్లడించారు. భారతీయ ప్రయాణికులకు వీలైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో ఇదీ ఒకటని జూలీ పేర్కొన్నారు. డిసెంబరు నుంచి మూడు నెలల పాటు అమెరికాలో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారులు.. వారి స్వదేశాలకు వెళ్లకుండానే వీసాలను రెన్యువల్‌ చేసుకోవచ్చన్నారు. పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద తొలుత 20వేల మందికి వీసాలను ఇక్కడే పునరుద్ధరిస్తామని తెలిపారు. ఇందులో మెజార్టీ భాగం భారతీయులే ఉంటారని తెలిపారు. క్రమక్రమంగా ఈ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తామని జూలీ వెల్లడించారు. దీంతో భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలు మరిన్ని కొత్త దరఖాస్తులపై ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్‌ను కేవలం హెచ్‌-1బీ కేటగిరీ వర్క్‌ వీసాలకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక నోటీసులు జారీ చేస్తామని, ఈ వీసా రెన్యువల్‌కు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అన్న వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

0Shares

Related posts

విస్తరిస్తున్న జే ఎన్.1 సబ్ వేరియంట్ వైరస్.

News Telangana

స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ❓️

News Telangana

రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు 1000 రైళ్లు

News Telangana

Leave a Comment