June 16, 2024
News Telangana
Image default
AndhrapradeshTelangana

సాగర్ డ్యామ్‌ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత

న్యూస్ తెలంగాణ డెస్క్ : నాగార్జున సాగర్‌ కుడి కాల్వ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యామ్‌ వద్దకు తెలంగాణ పోలీసులు భారీగా చేరుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన పోలీసుల అక్కడే మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో బుధవారం అర్ధరాత్రి సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లు, డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్‌పైకి చేరుకొని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్‌కు సంబంధించి నిర్వహణ విషయం నీటి పారుదలకు సంబంధించినదని, ముళ్లకంచెను తీసేయాలని ఏపీ పోలీసులకు సూచించారు. స్పందించకపోవడంతో తన సిబ్బందితో ఆయన వెనుదిరిగి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు తెలంగాణ
ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటి వరకు నీటి విడుదల, భద్రతా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంది..

0Shares

Related posts

తెలంగాణలో తొలి కాంగ్రెస్ విజయం

News Telangana

రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి

News Telangana

కనిపించని ఫుడ్ సేఫ్టీ అధికారులు

News Telangana

Leave a Comment