June 19, 2024
News Telangana
Image default
Telangana

ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడొద్దు.. విజయం మనదే.. తేల్చి చెప్పిన కేటీఆర్

హైదరాబాద్ డెస్క్, నవంబర్ 30 ( న్యూస్ తెలంగాణ ) :- ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడాల్సిన పని లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈరకమైన ఎగ్జిట్‌ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేమీ కాదు. డిసెంబర్‌ 3న 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తాం. ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైంది.’ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నారని.. అప్పుడే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడటమేంటని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ డిసెంబర్‌ 3న ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించిన మీడియా సంస్థలను ప్రశ్నించారు. ఎవ్వరూ కన్ఫ్యూజన్‌ కావద్దని.. వందకు 100 శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత 90 రోజులుగా కష్టపడ్డ మా కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా గంట, గంటన్నర సేపు పోలింగ్‌ జరిగేది ఉందని.. 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ఇంకా పోలింగ్‌ శాతం తేలలేదని.. ఫైనల్‌ పోలింగ్‌ ఎంత జరిగిందనేది రేపు ఉదయం తేలుతుందని తెలిపారు. ఎంత పోలింగ్‌ అయ్యింది.. ఎక్కడ ఎంత అయ్యింది.. ఏ నియోజకవర్గంలో ఎంత అయ్యిందనేది అనాలసిస్‌ చేసుకోవచ్చని అన్నారు.

0Shares

Related posts

ధర్మారం లో మెగా జాబ్ మేళా

News Telangana

మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ

News Telangana

ఆరోసారి ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు

News Telangana

Leave a Comment