తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న (ఆదివారం) ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. షబ్బీర్ అలీ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజాస్వామ్యం కాపాడేందుకు నిద్ర లేకుండా పని చేసారంటూ పేర్కొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని.. కామారెడ్డి ప్రజలకు అభినందనలు.. అంటూ పేర్కొన్నారు. తెలంగాణ సమాజ చాలా చైతన్యవంతం అయింది.. కేసీఆర్ తన తెలివితేటలతో, అక్రమ సంపాదనతో శాశ్వతంగా పాలించాలనుకున్నారని.. కేసీఆర్ ఆశయాలకు కామారెడ్డి ప్రజలు గండికొట్టారంటూ వ్యాఖ్యానించారు. శ్రీకాంత చారికి నా నివాళులు.. శ్రీకాంత చారి తన ప్రాణ త్యాగంతో తెలంగాణ ఆశయ సాదనను బతికించారన్నారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. దేశంలోని అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే అధికారం అని చెబుతున్నాయన్నారు. సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవని కేసీఆర్ ముఖం చాటేశారన్నారు. కేటీఆర్ ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని… ఒడిపోతామని తెలిసి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు ఈ రోజు నుంచే కాంగ్రెస్ శ్రేణులు గెలుపు సంబరాలు చేసుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ గెలిస్తే రాజు, ఓడితే బానిస అన్న ధోరణితో వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నీ తిరిగి పునరుద్దరిస్తామని.. సమ పాలన అందిస్తాం.. అందరికి అవకాశాలు కల్పిస్తాం.. మీడియాకి స్వేచ్ఛ కల్పిస్తాం.. అంటూ రేవంత్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద ఆధిపత్యం చేలాయించదని.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పారదర్శకంగా ఉండాలని పీసీసీ చీఫ్ గా నా సూచన.. అంటూ రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ అరాచకాలలో పాలు పంచుకున్న వారు ఇప్పటికైనా మారాలి తెలంగాణ కాంగ్రెస్ సునామిలో బీఆర్ఎస్ కొట్టుకుపోయిందన్నారు. కోదండరాం నేతృత్వంలో అమరవీరుల సంక్షేమం చేపడతామని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
previous post