రాయ్ పూర్, డిసెంబర్ 13 ( News Telangana ) :-
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నేడు జరగునన్న సంద ర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నలు గురు కేంద్ర మంత్రులు రాజధాని రాయ్‌పూర్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు.ఇందులో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళా లకు చెందిన ఒక సైనికుడు వీరమరణం పొందాడు. మరొక సైనికుడు గాయ పడ్డాడు. నారాయపూర్ లోని ఛోటాదొంగర్‌లో సైని కుల సెర్చింగ్ సమ యంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో ఒక సైనికుడు ఎల్ ఈ డీ పేలుడు బారిన పడ్డాడు. 9వ బెటాలియన్ కు చెందిన యువ కానిస్టేబుల్ కమలేష్ కుమార్ వీర మరణం పొందాడు. మరో కాని స్టేబుల్ వినయ్ కుమార్ కు స్వల్ప గాయాలైనట్టు తెలిసింది
previous post
next post