అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురంకు చేరుకోనున్నారు. అక్కడ డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిచనున్నారు. ఆ తర్వాత పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ వెళ్లనున్నారు..
previous post