వైజాగ్ , డిసెంబర్ 14 ( News Telangana ) :-
విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌లో ఉన్న ఇండస్ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రెండవ అంతుస్తులోని ఆపరేషన్ థియేటర్‌లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటల్లో పలువురు రోగులు చిక్కుకున్నారు. కొందరు భయంతో పరు గులు తీస్తుంటే మరికొంత మందిని ఆస్పత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన వారిని దగ్గరలోని వేరొక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో దట్టంగా పొగ అలముకుంది. నాలు గు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. మంటలు ఆర్పేందుకు సహా యక చర్యలు కొనసాగు తున్నాయి. పొగలో చిక్కు కున్న రోగులు కాసేపు ఊపి రి అందక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆసుపత్రి మంటల్లో చిక్కు కున్న అందరినీ బయటకు తీసుకొచ్చారు అసుపత్రి సిబ్బంది. నైట్రస్ ఆక్సైడ్ కారణంగా సిలిండర్ పేలి ఆపరేషన్ థియేటర్లో ముందుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉన్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండ టంతో దగ్గర్లోని మరో ప్రైవే ట్ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ థియేటర్లో మొత్తం 20 మంది రోజులు చికిత్స తీసుకుంటున్నట్లు స్థానిక ఎమ్మార్వో తెలిపారు. అసుపత్రికి రెవిన్యూ, పోలీసు అధికారులు చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్నాయి అసుప్రతి వర్గాలు
previous post
next post