హైదరాబాద్, డిసెంబర్ 16 ( News Telangana ) :-
సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. సిఎం కాన్వాయ్‌లోని 15 వాహనాలను 9 వాహనా లకు తగ్గించామని, తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్‌ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధి కారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకో వడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు.ఈ నేప థ్యంలో తానూ ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బం దులు తలెత్తకుండా ఏవిధ మైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధి కారులను సిఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టిం చుకోకుండా, ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు.
next post