గొల్లపల్లి, డిసెంబర్ 16 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన దాబా సతీష్ తల్లి వినోద అనారోగ్యంతో శుక్రవారం రోజున మరణించగా శనివారం రోజున గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. అదే గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు గుండెపోటుతో ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 3 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొలగాని మల్లయ్య, తుళ్ళ అజయ్, కంకణాల లక్ష్మణ్, సట్ట ఎల్లయ్య, రాచర్ల కిష్టయ్య, యం.డి నవాబ్, సట్ట సంతోష్, పోచయ్య, పోలగాని రాజు, తుల మోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
previous post