హైదరాబాద్, డిసెంబర్17 ( న్యూస్ తెలంగాణ ) :-
ప్రతీ వారం రెండు రోజుల మంగళ, శుక్రవారం, పాటు ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో రద్దీకి తగినట్లుగా టేబుళ్ళ సంఖ్య ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూర ప్రాంతాల నుంచి కూడా గ్రీవెన్స్ ఇవ్వడానికి ప్రజలు వస్తుండడంతో వారి కి తాగునీటి వసతితో పాటు కనీస సౌకర్యాలను కల్పించాల్సిందిగా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పది రోజులుగా ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులను దృష్టి లో పెట్టుకుని ఇకపైన నిర్వహించాల్సిన విధానంపై సచివాలయంలో శుక్రవారం అధికారులతో జరిగిన రివ్యూ పై క్లారిటీ ఇచ్చారు. శిక్షణలో వున్న ఐఎఎస్ అధికారుల సేవలను ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమానికి వినియోగించు కోవాలని సూచించారు. హైదరాబాద్‌లో ప్రజా భవన్‌లో వారానికి రెండు రోజుల పాటు జరుగుతున్న ప్రజావాణి ప్రోగ్రామ్‌ను ఇక పైన పల్లెలు పట్టణాల్లోనూ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ప్రతి నెలా మొదటి వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు ఇలాంటి సభలు నిర్వహిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తాయని, వెంటనే వాటికి తగిన పరిష్కారం లభిస్తుందని అధికారులకు సూచించారు. అక్కడికక్కకడే పరిష్కారం దొరికితే వారు హైదరాబాద్ వరకూ రావాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందన్నారు. అధికారులు చిత్తశుద్దితో కష్టపడాలని, సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయాన్ని గడువును నిర్దేశించుకుని పరిష్కరించాలని సూచించారు. దీంతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని, సుహృద్భావ వాతావరణంలో ప్రభుత్వం పనిచేసేందుకు అవకాశం వుంటుందన్నారు. మంత్రులంతా సచివాలయంలో వారి చాంబర్లలో ప్రజల నుంచి సమస్యలను తెలుసుకోడానికి డైలీ ఒక నిర్దిష్ట టైమ్ ఫిక్స్ చేస్తే ప్రయోజనం ఉంటుందని, దీన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఏదో ఒక టైమ్ నిర్ణయిస్తే ఆ ప్రకారమే ప్రజలు వచ్చి కలిసి వారి బాధలను చెప్పుకుంటారని పేర్కొ న్నారు. ఇందుకోసం నిర్దిష్ట టైమింగ్‌ను ప్రజల్లో ప్రచారం చేస్తే దానికి తగినట్లుగా వారు మంత్రుల ఛాంబర్ వరకూ వచ్చి చెప్పుకోడానికి సెక్యూరిటీ పరంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యేక అనుమతి ఇవ్వడం వీలవుతుందని, దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
previous post
next post