- పోలీసులకు ఇన్ఫర్మారుగా ఉన్నావంటూ ఆరోపణలు
- ని వల్లనే రాత్రి వేళల్లో మా ట్రాక్టర్ లు నడవడం లేదంటు కులం పేరుతో దుశించారు.
- 50 మంది కి పైగా రిపోర్టర్ పై దాడి చేసే ప్రయత్నం
- పోలీస్ లను ఆశ్రయించిన న్యూస్ తెలంగాణ రిపోర్టర్ రాజు
- తూర్కపల్లి గ్రామస్థులైన శివ్వని బాలలింగం, ప్రసాద్, బాలకృష్ణ, అజయ్ లు అడ్డుకునే ప్రయత్నం
- ట్రాక్టర్ యజమానులపై అట్రాసిటీ కేసు నమోదు
- విచారణ జరుగుతుందంటూ పోలీసుల వెల్లడి
పోలీస్ లకు ఇన్ ఫార్మర్ గా ఉన్నావంటూ “న్యూస్ తెలంగాణ” జిల్లా రిపోర్టర్ పై 50 మంది కి పైగా దానికి ప్రయత్నించిన ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది.
బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి
ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రాజు కథ కొంతకాలంగా రాజన్న సిరిసిల్ల జిల్లా న్యూస్ తెలంగాణ దినపత్రికలో పనిచేస్తూ ఉండేవాడు గత రోజు ఉదయం వాకింగ్ కు వెళ్లగా గండి లచ్చపేట మానేరు వాగు నుండి ఒక ట్రాక్టర్ అక్రమంగా ఇసుక తీసుకొస్తుండగా తంగళ్ళపల్లి కానిస్టేబుల్ శ్రీనివాస్ పట్టుకోగా అదే సమయంలో డ్రైవరు దిగి పరిగెత్తే ప్రయత్నంలో ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్న రాజు బాల్ లింగం డ్రైవర్ని అడగగా పోలీసులు పట్టుకున్నారని జవాబు ఇవ్వడంతో అక్కనుండి వెళ్లిపోగా తిరిగి ఉదయం 11:13 గంటల సమయంలో కానిస్టేబుల్ శ్రీనివాసు ను వార్త ప్రచురణ వివరణ కోరగా అతను బదులుగా అది కాళీ ట్రాక్టర్ అని జవాబు ఇవ్వడంతో వార్త ప్రచురణ కూడా చేయలేదని రాజు పేర్కొన్నారు. తదుపరి రోజు 20-01-2024 రోజున గండి లచ్చపేట గ్రామానికి చెందిన 50 మంది ట్రాక్టర్ యజమానులు, గ్రామస్థులు కలిసి తుర్కపల్లి గ్రామమైన రాజు గ్రామానికి వెళ్లి నువ్వే పోలీస్ ఇన్ఫార్మర్ గా ఉన్నావంటూ అవమానించి హేళన చేశారు. నేను ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పిన వినకుండా అదేక్రమంలో ముఖ దాడి చేసే ప్రయత్ననికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గండి లచ్చపేట గ్రామంలో ఎలాంటి ట్రాక్టర్ పట్టుపడ్డ నిన్ను ఆ గడ్డలోని బొంద పెడతామంటూ ఇష్టం సారంగా మాట్లాడుతూ కులం పేరుతో దూషించారు.తూర్కపల్లి ఇరువురి మధ్య తోపులాట జరగడంతో గ్రామస్తులైన శివుని బాలలింగం, శివ్వని ప్రసాద్, బాలకృష్ణ,మచ్చ ప్రభాస్, అజయ్,పలువురి గ్రామస్తులపై కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని అన్నారు. అదే క్రమంలో పోలీసులను ఆశ్రయించగా దాడిలో ప్రయత్నించి కులం పేరుతో దూషించిన వారి పైన అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.