October 7, 2024
News Telangana
Image default
Telangana

అవినీతికి “కేరాఫ్‌‌” గా సూర్యాపేట రవాణా శాఖ

  • ఫైల్‌కు పెన్సిల్‌తో కోడ్ …?
  • ఈ కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది
  • అక్కడ ముందు దరఖాస్తు చూడరు
  • దరఖాస్తు వెనకాల ఉన్న సంఖ్యను చూస్తారు
  • కోడ్ భాషలోనే ఆ కార్యాలయంలో మాట్లాడుకుంటారు

స్టేట్ బ్యూరో, జనవరి 26 (న్యూస్ తెలంగాణ ) :- అక్కడ ముందు దరఖాస్తు చూడరు.. దరఖాస్తు వెనకాల ఉన్న సంఖ్యను చూస్తారు.. కోడ్ భాషలోనే ఆ కార్యాలయంలో మాట్లాడుకుంటారు. ప్రతి ఫైల్‌కు పెన్సిల్‌తో కోడ్ వేస్తారు. ఆ కోడ్ సంఖ్యను బట్టి మనం ఇచ్చే ఫైల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ల భాషలో సరియైన కోడ్ ఐతే ఆ పని చకచకా అవుతుంది. కోడ్ తప్పు ఐతే ఎన్ని రోజులు తిరిగినా ఫలితం ఉండదు. ఎవ్వరు చెప్పినా ఆ పనినే పూర్తి కాదు. అది అక్కడ ఆగిపోవాల్సిందే, రవాణా శాఖ కార్యాలయంలో ఒక కోడ్‌కు ఉన్న విలువ మనుషులకు లేదు. అక్కడ అధికారులు, బ్రోకర్లు ముందే ఒక ఒప్పందానికి వస్తారు. వాళ్ల భాషలో వాళ్లు అర్థమయ్యేలా ముందే మాట్లాడుకుంటారు. అక్కడ బ్రోకర్‌ను కలిసి అమ్యామ్యాలు మాట్లాడుకుని కోడ్ వేస్తేనే ఇక్కడ కార్యాలయంలో పని పూర్తవుతోంది.

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

అన్ని కాగితాలన్నీ సక్రమంగా ఉన్న పని జరగదు గాక జరగదు. అవినీతి ఇక్కడ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లుతూ సామాన్యుడిని నరనరాన డబ్బులు గుంజుతూ అవినీతి కి కేరాఫ్‌గా మారింది సూర్యాపేట జిల్లాలో ఉన్న రవాణా శాఖ కార్యాలయం ఈ కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది. ఒక్కో పనికి ఒక అధికారిని కలవాల్సి ఉంటుంది, ఎవరైనా అన్ని సరైన ధ్రువపత్రాలతో నేరుగా కార్యాలయానికి వెళ్తే వాళ్లకు కోర్రిలే తప్పువు. సాక్షాత్తు కౌంటర్‌లోని అధికారే మీ బ్రోకర్ ఎవరు అతని పేరు కోడ్ రూపంలో దరఖాస్తు వెనుకభాగం వైపు రాయమని అడుగుతాడు. ఒకవేళ దరఖాస్తుదారుడు నేరుగా వచ్చామని చెప్తే దరఖాస్తు ఏదో ఒక కారణంతో ప‌క్కకు పోతుంది. కింది స్థాయి ఉద్యోగులను గాడిలో పెట్టాల్సిన అధికారులే అవినీతికి పాల్పడితే సిబ్బంది సరైన మార్గంలో ఎలా నడుస్తారు..? అందుకే జిల్లాలో రవాణ శాఖ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారిపోయాయి. వాహనదారులు లైసెన్స్, వాహన రిజస్ట్రేషన్లు, పాత వాహనాలకు నెంబర్లు ఇలా ఏ పనులు చేయించుకోవాలన్నా వారు నేరుగా ఆర్టీఏ కార్యాలయంలోకి వెళితే పనులు కావడం లేదు. డ్రైవింగ్‌ సరిగ్గా రాకపోయినా, వాహనాలు ఉండి లైసెన్సులు లేకపోయినా దళారుల వద్దకు పోయి వారు చెప్పిన ఫీజులు చెల్లిస్తే పనులు అయిపోతాయి.

  • అధికారుల కనుసన్నల్లోనే..?

జిల్లాలో అవినీతికి అలవాటు పడ్డ రవాణా శాఖ అధికారుల అక్రమ ఆదాయం రోజుకు కొన్ని లక్షల రూపాయలు పైమాటే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీస్ పరిసరాల్లోని ఏజెంట్ల ద్వారా పనులు చక్క పెడుతున్న అధికారులు.. వారి స్థాయిని బట్టి వాటాలు పంచుకున్నట్లు సమాచారం కొన్నేండ్లుగా ఈ లంచాల వ్యవహారం అటెండర్ నుంచి అధికారి వరకు యథేచ్ఛగా సాగుతుందనేది బహిరంగ రహస్యమే..! అయినప్పటికీ అధికారుల అక్రమ దందా పై శాఖాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఏజెంట్‌ల వ్యవహారం అందరికి తెలిసిందే అనడంలో అతియో శక్తి లేదు.

  • పాతుకుపోయిన ఉద్యోగులు..?

జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు కొన్ని ఏండ్లు గా ఇక్కడే పని చేస్తూ పాతకపోయారు. డిటివో, ఆర్‌టివో లకు కూడా వీరే చెప్పేందే ఫైనల్ బాస్ లు కూడా కింది స్థాయి ఉద్యోగులతో చేతులు కలపడంతో ఈ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది.

  • అడిగినంత ఇవ్వాల్సిందే ..?

రవాణాశాఖలో వాహనదారులకు లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ, తదితర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే ఎలాంటి పనైనా వెంటనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఏజెంట్ అడిగినంత ముట్టజెప్పాల్సిందే. వీటికితోడు వాహనాల ఫిట్‌నెస్‌లు, పేర్ల మార్పిడి, ఓవర్ లోడ్ వెహికల్స్‌కు ఫైన్ల పేరిట అదనంగా గుంజుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

  • అందరికీ ఇవ్వాలి కదా.. ?

జిల్లాలో ఇసుక, గ్రానైట్ రవాణా చేసే లారీలు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. లారీలు ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్నందున రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిని నివారించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించాలి. కానీ, లారీ యాజమానుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుని నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. రవాణాశాఖలో పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్నప్పటికీ ఏసీబీ, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా ఉండేందుకు గానూ ఆయా వర్గాలను మేనేజ్ చేస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బినామీల పేరిట ఆస్తులు కూడ బెట్టుకుంటూ ప్రతీ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి తప్పుడు ఆదాయ లెక్కలు చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా లో ఉన్న కొంత మంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు నెలవారీగా మామూళ్ల ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

న్యూస్ తెలంగాణ వేచి చూడండి “ఎపిసోడ్ 2” అతి త్వరలో

0Shares

Related posts

మట్టి మాఫీయా కి అడ్డుకట్ట పడేనా …?

News Telangana

Anganwadi Jobs : 14000 అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. అర్హతలు ఇవే..!

News Telangana

డబల్ ధమాకా … డబల్ రిజిస్ట్రేషన్ లు

News Telangana

Leave a Comment