- “మాజీ మంత్రి అండదండలతో యదేచ్చ భూ కబ్జాలు చేసి భూ బకాసురుడిగా మరి కోట్లకు పడగెత్తిన సర్పంచ్”
ఖమ్మం కి కుతవేటు దూరం లో వున్న ఉదయ్ నగర్ లో జరిగే ఈ బకాసురుడి భూ ఆక్రమణలు జిల్లా అధికారులకు తెలవనట్ల లేదా శ్రీ రామదాసు చిత్రంలో మంచు గడ్డను వలే అందరికి వాటా ఉన్నదా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి 9 (న్యూస్ తెలంగాణ)
ఉదయ్ నగర్ లో నేనే రాజు నేనే మంత్రి గా వ్యవహరించి డబుల్ బెడ్ రూమ్లలో పోయిన ఫ్లాట్లకి నేను ఫ్లాట్ ఇస్తా అంటూ పదుల సంఖ్యలో బాధితుల దగ్గర 20 నుంచి 30 వేలు మరి కొంతమంది దగ్గర 50 నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఇటు చూసుకున్నట్లయితే నాటికి కొందరు బాధితులకు ఫ్లాట్లు చూపియకుండా వారిని భయభ్రాంతులకు గురిచేసి అలా మభ్యపెట్టుకుంటూ వస్తున్నాడు ఆ అక్రమార్క సర్పంచ్
ఇప్పటికీ ప్రభుత్వ ఇళ్ళ స్థలాలను అమ్ముతున్న అక్రమార్కడు వివరాల్లో కి వెళితే ఖమ్మం కి అనుకొని వున్న పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీ కి చెందిన గ్రామ ప్రజా ప్రనిదిగా వుంటూ ఆ కాలనీలో నిరు పేద ల కోసం ఇచ్చిన ఇళ్ళ స్థలాలను దొంగ పట్టాలు పుట్టించి ఒక్కో ప్లాట్ 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు దండుకున్నాడు పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన తన అనుచరులుగా వున్న వారి పేరు మీద అగ్రిమెంట్ పత్రాలు రాస్తూ కొన్ని వందల ఇళ్ళ స్థలాలను కొల్ల గొట్టాడు ఈ ప్రబుద్ధుడు ఎవరికి ఇచ్చే వాట వారికి ఇస్తూ అధికారులకు దొరకకుండా ఇష్టాను సారంగా బుములను అమ్ముతున్నాడు కొంత మంది ఆకతాయులకు మద్యం పోయించీ ఎస్సైండ్ భూముల యజమానులను బెదిరించి యకారం 4 లక్షలకు కొని ప్లాట్లు గా మార్చి కోట్ల రూపాయలు గడించాడు మమత హాస్పిటల్ దగ్గర్లో nsp కలవమీద స్థలాన్ని ఆక్రమించి 4 అంతస్తుల భవనం నిర్మించాడు ఇప్పటికైన ఇలాంటి అక్రమార్క సర్పంచ్ పై ఎంక్వైరీ వేసి కటినంగా శిక్షించాలని సామాన్య ప్రజలు పలువురు బాధితులు జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కలిసి పిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సర్పంచ్ తో పాటు ఇందులో భాగస్వామ్యలుగా ఉన్నటువంటి అధికారుల పై సైతం ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇప్పటికైనా జిల్లా అధికారులు కలెక్టర్ పి వి గౌతమ్ స్పందించి ఆ అక్రమార్కుడు పై తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరుచున్నారు…