News Telangana :- హైదరాబాద్‌లో 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామని తెలిపారు.
హరిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు త్వరలో సమగ్ర ఇంధన పాలసీ రూపొందిస్తామని చెప్పారు. రిజర్వాయర్లను పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పెద్దఎత్తున మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపడతామని.. మూసీ మరోసారి హైదరాబాద్ జీవనాడిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ వెల్లడించారు. క్రీడారంగంలో రాష్ట్రాన్ని అగ్రగ్రామి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సమాజంలో వివక్ష, అణచివేతకు గురైన అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం కాదు.. ఉమ్మడి భవిష్యత్‌కు నమూనా అని వ్యాఖ్యానించారు. కాళోజీ కవితతో ప్రసంగం మొదలు పెట్టిన గవర్నర్ తమిళ కవి సుబ్రమణ్య భారతి మాటలతో ప్రసంగం