- వసూళ్ల కు అడ్డా గా అదిలాబాద్ చెక్ పోస్ట్ అధికారులు
- చెకింగ్ కి నోచుకోని చెక్ పోస్ట్?
- ఆపరేషన్ చెక్ పోస్ట్ 2
ఆదిలాబాద్ చెక్ పోస్ట్ లో రోజురోజుకి వెలుగులోకి వస్తున్న కొత్త నిజాలు అక్కడ అంతా మాయే ..! ఈ చెక్ పోస్ట్ కి చెక్ పెట్టేది ఎలా ? అసలు చెక్ పోస్ట్ లో కాసుల వర్షం ఎందుకు కురిపించాలి? మరీ ఇంత లా వసూళ్ల ..? ఇంత జరుగుతుంటే అక్కడ సీసీ కెమెరాలు ఏమైనట్లు..? మాయే రా అంత మాయే రా అదిలాబాద్ చెక్ పోస్ట్ అంతా మాయ రా..! కాసుల వర్షం కురిస్తే ఒక లెక్క లేనట్లయితే మరొక లెక్క అంటున్న చెక్ పోస్ట్ అధికారులు సిబ్బంది ఇదిలా ఉండగా ఎవరైనా పత్రిక విలేఖరి రాసినట్లయితే బెదిరింపులు బెంబేలులు జిల్లా అధికారులకు మరియు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కి పిర్యాదు చేసినప్పటికి పట్టనట్టే వ్యవహరిస్తున్న వైనం చెక్ పోస్ట్ లో అధికారులు ఇంతలా అక్రమాలకు పాల్పడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం అంధకారంలో కూరుకుపోయి చోద్యం చూస్తున్న వైనం ఈ చెక్ పోస్ట్ కి చెక్ పెట్టేది ఎలా…? చెక్ పోస్ట్ లో ఇంతలా వసుళ్ల పర్వం నడుస్తున్నప్పటికీ జిల్లా అధికారులకి కనిపించడం లేదా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏమైనట్లు…? ప్రస్తుతం చూసుకున్నట్లయితే తెలంగాణలో అన్ని గవర్నమెంట్ కార్యాలయాలలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉన్నాయి కానీ చెక్ పోస్ట్లు చూసుకున్నట్లయితే సీసీ కెమెరా పర్యవేక్షణకు కరువైనట్లుగా పలువురు వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ జిల్లా కలెక్టర్ స్పందించి చెక్ పోస్ట్ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు కోరుకుంటున్నారు .