👉అన్నం పలుకుతో అవస్థలు
👉నీళ్ల కూరాలతో పిల్లలకు భోజనాలు
👉గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్,నిర్లక్ష్య వైఖరి
👉నిద్ర మత్తులో సంబంధిత అధికారులు,
తంగళ్లపెల్లి /న్యూస్ తెలంగాణ
ఎన్నో చోట్ల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం. అదే తీరుగా తంగళ్లపెల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజనం అందించక అస్వస్థత గురిచేసే దుస్థితి నెలకొంది.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో వంటశాల సిబ్బంది కలుషితమైన నీటితో వంటకలు చేసి పిల్లలకు వడ్డించే భోజనాలలో అన్నం ఉడికి ఉడకని అన్నం పెడుతూ, కరబైన పెరుగు, బెండకాయ, చిక్కుడుకాయ కూరలో పూర్తిగా నీళ్లు కలిపి పెడతు ఎవరు అడుగుతారని నెపంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థు ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మేం పెట్టిందే తినాలి అంటూ పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తున వైనం. ఎన్నోసార్లు ఇలాంటి ఫుడ్ పెడుతున్న నిరాకరించక విద్యార్థులు తిన్న రోజులు ఎన్నో ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఆవేదన.నన్ను ఏ అధికారులు ఏం చేస్తారు లే..? అంటూ పాఠశాల ప్రిన్సిపల్ పద్మ విద్యార్థులతో వ్యవహిరించే తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థులు అస్వస్థత లాంటి సమస్యలు సంఘటనలు జరగకముందే సరైన భోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. వంటశాల సిబ్బంది పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు