October 5, 2024
News Telangana
Image default
Telangana

గుట్టలు కాసుల కుప్పలు..! పేరుకే మైనింగ్ అధికారులు

నేలకొండపల్లి,ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలలా గుట్టలు కాసుల కుప్పలు..!!
-పవర్ మేక్ కంపెనీ పేరుతో కోట్లు విలువ చేసే మట్టి తరలిస్తున్నారు..
-ప్రభుత్వ ఆదాయానికి గండి..
-ప్రకృతి అందాలను సర్వనాశనం చేస్తున్న పవర్ మేక్ కంపెనీ
-పేరుకే మైనింగ్ అధికారులు
-స్థానిక ప్రజలు పిర్యాదు చేసిన పట్టించుకోరు..


స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం మే4 (న్యూస్ తెలంగాణ)

ముదిగొండ,నెలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల నుండి నేషనల్ హైవే పేరుట పవర్ మేక్ కంపెనీ పేరుతో కోట్ల రూపాయల విలువ చేసే ప్రకృతి గుట్టలను కాజేస్తున్నారు.స్థానిక ప్రజలనుంచి ముక్తకంఠంతో గతంలో మట్టితోలకాలు అపూజేశారు. నేలకొండపల్లి,ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలు నుండి కోట్ల రూపాయల విలువ చేసే మట్టి తరలిస్తున్నారు.చర్యలు తీసుకోవాల్చి ఉన్న
అధికారులు చేయాల్సిన పని మాత్రం శూన్యం ఖమ్మం జిల్లా మైనింగ్ అధికారులకేమైంది…?
ఈ ప్రాంతంలో ఎక్కడ ప్రభుత్వ భూమిలో ఉన్నా ఇదే గుట్టపై గతంలో మట్టి తోలకాలు జరిపారు.
ప్రభుత్వ భూములకు కోట్ల విలువ ఉంది ఇదే అదునుగా భావించి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారు.ఇదే అదును చేసుకొని స్థానికంగా ఉన్న ప్రభుత్వ గుట్టల నుండి యథేచ్ఛగా కోదాడ నుంచి ఓ హైవే, రింగ్ రోడ్ ప్రాంతం గుట్ట, లేదా ఇంకేమైనా అడవులకు తెలుసుకున్న అధికారులు కాకుల్లా వాలారు.
మండలాల కేంద్రం సరిహద్దు నుంచి వెళుతుండుటంతో అనుకూలమైన భూమి అయి ఉంటే దానికి ఈ గుట్ట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి
ఉండడం తో భూదాహంతో ఉన్న భకాసురులు రక్షణ కవచంగా ఉండి ప్రకృతి సంపద నదని రక్షణ ఇచ్చిన అధికారులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. కాపాడాలి. అలాంటి వేమీ పట్టించుకోక పోగా, ఇప్పుడెందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్నదే
ముదిగొండ గుట్టలు. కాసుల కుప్పలు
ఎక్కడ ఏ సర్వేనంబర్లో భూమి ఉందా అని
భూతద్దం వేసుకుని చూసి, చూసిందే తడవుగా
కన్నేస్తున్నారు. ఖతం ఎలాగైనా ఆ భూమి
కైవసం చేసుకోవాలనే కక్కుర్తితో అధికారుల
చెంతకు చేరారు. అసలు కథ అధికారు
లనుంచే మొదలైంది. ఈ భూమ్మీద పూచిక
పుల్లతో సహా లెక్కలు కట్టి ఉన్నది లేనట్లు,
లేనిది ఉన్నట్లు మసిపూసి మారేడు కాయలు
చేసే రెవెన్యూ అధికారులు అక్రమార్కుల
నుంచి లక్షల్లో దండుకుని చేతులు దులుపుకుం
దామని ఆశ పడ్డారు. అన్నంత పనిచేశారు.
ఆఖరుకి కొందరిపేరున పాస్బుక్కులు చేసే
ప్రయత్నం చేసి భంగపడ్డారు. అప్పుడు నాలు
క్కరుచుకొని ఈ భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్
అని రికార్డుల్లో రావడం, అదికాస్తా ఆనోట, ఈ
నోట పడి బయటికి పొక్కడంతో ఆభాసుపా
లయ్యారు. ఇప్పడు ఉన్నతాధికారుల చెంతకు
పరుగులు పెట్టే పరిస్థితి నెలకొంది. ఈ
భూమిలో ప్రస్తుతం అక్రమ మైనింగ్, మట్టి
తోలకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.. న్యూస్ తెలంగాణ ‘వరుస ప్రత్యేక కథనాలు..
అధికారులకు సమాచారం ఇచ్చినా
తూచ్..
ఇదే విషయమై జరుగున్న తతంగం మొత్తం
సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా
పట్టించుకోక పోగా, కనీసం ఏరియాను
సందర్శించిన పాపాన పోలేదంటే అధికారుల
తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు
తున్నాయి. ఎందుకు పట్టించుకోవడంలేదు.
సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంపై
పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుట్టలు మింగుతున్న ఘనులు..
ముదిగొండ మండలంలో కొన్ని ఏరియాలలో
ప్రకృతి సహజంగా ఏర్పడ్డ గుట్టలు ఉన్నాయి.
ప్రస్తుతం ఇక్కడ ఉన్న భూమికూడా అదే
కోవకు చెందినది కావడంతో అక్రమార్కులకు
కలిసి వచ్చింది. ఇదే అదనుగా భావించిన
కొందరు సర్వే నంబర్ 217/2,
217/1/1/2 లలో ఉన్న భూమిపై
కన్నేశారు. రెవెన్యూ అధికారులకు కాసుల
పంట కురిపించే అవకాశం వచ్చిందని
భావించిన కొందరి పుర్రెలో దురాలోచనకు
దారి తీసింది. ఇంతలో హైవే పనులు ఊపం
దుకోవడంతో శరవేగంగా గుట్టను మింగే
పనిలో కొందరు, రికార్డులు మార్చే పనిలో
మరికొందరు, హైవే అయితే బ్లాస్టింగ్కు
అనుమతులు ఉండవని ఇంకొదరు ఇలా ఎవరి
పని వారు ‘కొండంత’ బాధ్యతగా తీసుకుని
కోటి రూపాయల ప్రశ్న. అంటే అది ఎవరికి
దక్కాల్సిన ముడుపులు వారికి చేరబట్టే ఈ
రోజు సమాచారం అందించినా వచ్చే పరిస్థితి
లేదని మండల ప్రజలు వాపోతున్నారు.
హైవే అధికారులే సూత్రధారులా..?
హైవే పనులు నిర్వహిస్తున్న సంబంధిత (పవర్
మేక్) కాంట్రాక్టర్ రోడ్డు పనులకు మట్టి
అవసరం ఉంటే మట్టి ఉన్నదగ్గరనుంచి
సంబంధిత అధికారులునుంచి సరైన రీతిలో
అన్ని అనుమతులు తీసుకుని ఆ మట్టి నిర్ణీత
గడువులోగా తరలించాలని నిబంధన ఉంది.
అయినా పట్టించుకోకుండా హైవే పనులు చేసే
అధికారులే స్వయంగా ఆ మట్టిని తరలించి
ఏలాంటి అనుమతులు లేకుండా
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో మండల
ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కళ్ల
ముందే కొండంతా కరిగి పోతుంటే వారు
చేసేదేమీ లేక నిస్సహాయులై అధికారులకు
సమాచారం అందిస్తే, అదికాస్త నీరుగార్చే
•సమాచారం ఇచ్చినా
•పట్టించుకోని సంబంధిత శాఖాధికారులు..
అక్రమంగా సాగుతున్న మట్టి తోలకాలు. గుట్టలను మింగుతున్న ఘనులు. పేరుకే మైనింగ్ అధికారులు.పట్టించుకున్న పాపాన పోరు..
రికార్డుల్లో పక్కా ఫారెస్ట్ భూమి అని ఉన్నా చురుకే లేదు. అధికారుల అండదండలతోనే అంతా ? ప్రకృతి వనరులు కాపాడాలని స్థానికుల వేడుకోలు.
రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలకు సమాచారం
ఇచ్చినా చర్యలు శూన్యం..!! పనిలో మైనింగ్, ఫారెస్ట్ అధికారుల తీరు ఉండడంటంతో ఆందోళన చెందుతున్నారు.ఇష్టారీతిన బ్లాస్టింగ్, యథేచ్ఛగా
మరలింపు. ఘోరం మైనింగ్ అధికారుల అండదండలతో హైవే అధికారులు అందినకాడికి తెగదోచుకుం
టున్నారు. ఇష్టమొచ్చినట్లు బ్లాస్టింగ్ చేస్తూ
ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. పేలుళ్ల
శబ్దాలతో అల్లాడుతున్న మండల ప్రజలను
భయభ్రాంతులను చేయడం, అక్రమంగా
మట్టిని హైవే అధికారుల అండదండలతో
తరలించడం పనిపాటైంది. ఈ చూడలేక కొందరు సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే చర్యలు శూన్యం. రెవెన్యూ అధికారుల చేతివాటం..
మైనింగ్ అధికారుల మొద్దు నిద్ర..
ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ
అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో,
మైనింగ్ అధికారులు సైతం సమాచారం
అందించినా పట్టించుకునేంత స్పృహ లేనంత
మొద్దు నిద్రలో ఉన్నారంటే అధికారులు అక్ర
మార్కులకు ఎంత అండగా ఉంటున్నారో
అర్థం అవుతుంది. అసలు సమాచారం
ఇవ్వకున్నా ఎక్కడైనా ప్రభుత్వ భూమి
ఆక్రమణకు గురవుతుందా అని భూతద్దం వేసి
చూసే రెవెన్యూ అధికారులు, మైనింగ్
అధికారులు ఇక్కడ ఇంత అక్రమ దందా జరు
గుతుందని సమాచారం ఇచ్చినా కనీసం
కన్నెత్తి చూడకపోవడంతో మండల ప్రజలు
ముక్కున వేలేసుకుంటున్నారు.
(వేచి చుడండి న్యూస్ తెలంగాణ సంచలన నిజాలతో ఎపిసోడ్ 2 లో )

0Shares

Related posts

ఎల్లారెడ్డిపేట్ పోలీసుల సాహసం

News Telangana

ప్రశాంత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు

News Telangana

రేపటినుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

News Telangana

Leave a Comment