గొల్లపల్లి, డిసెంబర్ 16 (న్యూస్ తెలంగాణ): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మిపూర్ గ్రామంలోని స్థానిక పలువురు అయ్యప్ప స్వాములు నీలం సత్యం, మడిగేలా రాజన్న, ఆకుల తిరుపతి లు అక్టోబర్ 30 న శబరిమలై కి పాదయాత్ర గా వెళ్ళారు. సుమారు 1250 కిలోమీటర్లు 55 రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసి, కేరళ రాష్ట్రం లోని శబరిమలై కి చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుని, ముడుపులు చెల్లించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా వారి కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకోవడం జరిగింది. అనంతరం తిరుగు ప్రయాణం చేసి శనివారం రోజున సురక్షింతంగా ఇంటికి చేరుకున్నారు. స్వాములు భక్తి తో చేసిన పాదయాత్ర ను గ్రామస్తులు అభినందించారు.