సిద్దిపేట ప్రతినిధి నవంబర్ 30 (న్యూస్ తెలంగాణ):- సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం 114 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొన్న మంత్రి హరీష్ రావు ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు
- రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందని..
- ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు..
- గతంలో కంటే పోలింగ్ మెరుగ్గా ఉంది..
- రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో, బాగుంటుందో మేధావులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలి.. అని
- ఓటు అనేది 5 సంవత్సరాల భవిష్యత్ నిర్ణయించేది.. అని
- పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలి అని
- కొంత మంది పరిధి దాటి మాట్లాడుతున్నారు.. అని
- నాగార్జున సాగర్ ఇష్యూ పై పోలింగ్ ముగిశాక మాట్లాడుతా… అని తెలిపారు