తిరుమల, డిసెంబరు15 ( News Telangana ) :-
బాలీవుడ్ నటి దీపిక పదుకొనే వెంకన్న దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలిన డకను ప్రారంభించిన ఆమె రాత్రి 7:30గంటలకు తిరు మలకు చేరుకున్నారు. రాథేయం అతిథిగృహంలో టీటీడీ ఆమెకు బసకల్పిం చింది. దీపిక పదుకొనే శుక్ర వారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని ఆమె మొక్కులు చెల్లించు కున్నారు. టిటిడి అధికారులు ఆమెకు పట్టు వస్త్రాలు సమ ర్పించారు.
next post