తిరుపతి ప్రతినిధి ( News Telangana ) :- భక్తులను చిరుత భయం మళ్లీ పట్టుకుంది. ఇటీవల కాలంలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారి లో చిరుతల సంచారం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అలిపిరి నడకదారిలో చిరుత సంచారం మళ్లీ శ్రీవారి భక్తులకు భయాందోళనకు గురిచేస్తుంది. అలిపిరి మార్గంలో ఉన్న నరసింహ స్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో చిరుత కనిపించడంతో భక్తులందరూ, ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే టీటీడీ అధికారులు అలాగే అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయిపోయారు.నడక దారిలో వెళ్లే తిరు మల శ్రీవారి భక్తులను గుంపులు గా మాత్రమే అనుమతిస్తు న్నారు. అలాగే… వారికి కర్రలు కూడా అప్పగిస్తున్నారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
previous post
next post